India: ఐక్యరాజ్యసమితిలో శాంతి వచనాలు పలికిన పాకిస్థాన్ ప్రధానిపై భారత్ విమర్శలు

  • యుద్ధం వల్ల కశ్మీర్ అంశానికి పరిష్కారం దొరకదన్న పాక్ ప్రధాని
  • శాంతియుత చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని వ్యాఖ్య
  • టెర్రరిజంను పోషిస్తున్న వాళ్లు శాంతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్న భారత్
India response on Pakistan PMs peade comments

ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ నిన్న చేసిన వ్యాఖ్యలపై భారత్ విమర్శలు గుప్పించింది. పొరుగు దేశాలతో పాకిస్థాన్ శాంతిని కోరుకుంటోందని చెప్పారు. కశ్మీర్ అంశానికి పరిష్కారం లభిస్తేనే ఇండియాతో శాంతిపూర్వక బంధాలు నెలకొంటాయని అన్నారు. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఈ విషయాన్ని భారత్ అర్థం చేసుకోవాలని... యుద్ధం ఒక పరిష్కారం కాదని అన్నారు. కేవలం శాంతియుత చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని అన్నారు.  

పాక్ ప్రధాని వ్యాఖ్యలపై ఇండియా మండిపడింది. టెర్రరిజంను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ శాంతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేసింది. ఇండియాకు వ్యతిరేకంగా తప్పుడు వ్యాఖ్యలు చేసేందుకు ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికను ఉపయోగించుకోవడం దారుణమని చెప్పింది. సొంత దేశాన్నే చక్కదిద్దుకోలేని వ్యక్తి... ఇండియా గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెలిపింది. ముంబై టెర్రర్ దాడులకు పాల్పడిన వారికి పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందని విమర్శించింది. టెర్రరిస్టులను పాకిస్థాన్ పెంచి పోషించడం ఆపేస్తేనే శాంతి సాధ్యమవుతుందని వ్యాఖ్యానించింది.

More Telugu News