Team India: ఉప్పల్ స్టేడియంలో టీమిండియా, ఆసీస్ మ్యాచ్ కు భారీ భద్రతా ఏర్పాట్లు

  • ఈ నెల 25న హైదరాబాదులో మ్యాచ్
  • తలపడనున్న టీమిండియా, ఆస్ట్రేలియా
  • ఏర్పాట్ల వివరాలు తెలిపిన సీపీ మహేశ్ భగవత్
  • మ్యాచ్ కోసం 2,500 మందితో భద్రత
Huge security arrangements for Team India and Australia match at Uppal stadium

ఈ నెల 25న టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ కు హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ మ్యాచ్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. 2,500 మంది సిబ్బందిని ఈ మ్యాచ్ కోసం వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఇవాళ నాగపూర్ లో మ్యాచ్ ముగిసిన అనంతరం ఆటగాళ్లు హైదరాబాద్ చేరుకుంటారని వివరించారు. నగరంలోని రెండు హోటళ్లలో వారికి బస ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇక, ఈ మ్యాచ్ కు 40 వేల మంది వస్తారని భావిస్తున్నట్టు మహేశ్ భగవత్ తెలిపారు...

ఇతర వివరాలు...

  • ఉప్పల్ స్టేడియం వెలుపల ఉన్న అప్రోచ్ రోడ్లను మా అధీనంలోకి తీసుకున్నాం. స్టేడియం వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి. మ్యాచ్ జరిగే రోజు సాయంత్రం 4 గంటల నుంచి స్టేడియం వైపు భారీ వాహనాలకు అనుమతి లేదు.
  • సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు.
  • 300 సీసీ టీవీ కెమెరాలతో నిఘా.
  • ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత క్రికెట్ అభిమానులకు ఇబ్బంది కలగకుండా రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు తిప్పాలని విజ్ఞప్తి చేశాం.
  • అదే సమయంలో అదనపు బస్సుల కోసం ఆర్టీసీకి కూడా లేఖ రాశాం.
  • మ్యాచ్ కు వచ్చే అభిమానుల వాహనాలను దృష్టిలో ఉంచుకుని 21 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశాం. ఒక్కో పార్కింగ్ లో 1,400 ఫోర్ వీలర్లు పట్టేలా ఏర్పాట్లు. గేట్ నెం.1 వద్ద వీఐపీ, వీవీఐపీ పార్కింగ్ ఏర్పాటు చేశాం.
  • 5 మొబైల్ పార్కింగ్ లు, ఎమర్జెన్సీ వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు.

More Telugu News