Congress: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నేను దూరం: రాహుల్ గాంధీ

  • కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోటీపై స్పందించిన రాహుల్ గాంధీ
  • కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో తాను లేనని ప్రకటన
  • ఈ దఫా గాంధీయేతర వ్యక్తే అధ్యక్షుడు అవుతారని ప్రకటన
rahul gandhi clarifies his contest in congress presidential electcions

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన గురువారమే ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో లేనంటూ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని తాను ఇదివరకే చెప్పానని కూడా ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీకి తాను దూరంగా ఉంటానని కూడా రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు.


కాంగ్రెస్ పార్టీకి ఈ దఫా గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తే అధ్యక్షుడు అవుతారని రాహుల్ గాంధీ మరో కీలక వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం తాను చేస్తున్న భారత్ జోడో యాత్రను ఓ సామాన్య పార్టీ కార్యకర్త హోదాలోనే చేస్తున్నానని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోలింగ్ తప్పనిసరి అని తేలిపోయినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటికే అధ్యక్ష బరిలో నిలిచేందుకు శశి థరూర్, అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్ తదితరులు సిద్ధపడగా... మరింత మంది పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

More Telugu News