Karnataka: 'పేసీఎం' అంటూ బొమ్మైకు వ్యతిరేకంగా బెంగళూరులో వెలసిన పోస్టర్లు

  • ఉద్యోగాలు, కాంట్రాక్టుల్లో అవినీతి చోటుచేసుకుంటోందన్న కాంగ్రెస్
  • పేసీఎం క్యూఆర్ కోడ్ స్థానంలో సీఎం బొమ్మై ఫొటో
  • 40 శాతాన్ని ఇక్కడ స్వీకరిస్తామని యాడ్
PayCM Posters In Bengaluru Target Chief Minister Bommai

కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకు వ్యతిరేకంగా బెంగళూరులో పలు పోస్టర్లు వెలిశాయి. 'పేసీఎం' అంటూ విపక్షాలు పోస్టర్లను ఏర్పాటు చేశాయి. ఎలక్ట్రానిక్ వ్యాలట్ పేమెంట్లయిన పేటీఎం, గూగుల్ పే తరహాలో ఈ పోస్టర్లు ఉన్నాయి. ఈ పోస్టర్లలో క్యూర్ కోడ్ స్థానంలో బొమ్మై ఫొటోను ఉంచారు. 40 శాతం మొత్తాన్ని ఇక్కడ స్వీకరించడం జరుగుతుందని పోస్టర్లలో పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంటోందంటూ కాంగ్రెస్ పార్టీ ఇటీవలి కాలంలో విమర్శలను పెంచుతోంది. ఈ క్రమంలోనే ఈ పోస్టర్లు వెలిశాయి. అయితే ఈ పోస్టర్లకు సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. ఈ పోస్టర్లను ప్రభుత్వ సిబ్బంది తొలగించారు.

More Telugu News