Supreme Court: ఇకపై యూట్యూబ్‌లో సుప్రీంకోర్టు విచార‌ణ‌లు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం

  • లైవ్‌గా ప్ర‌సార‌మైన జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ చివ‌రి రోజు విచార‌ణ‌లు
  • ఈ నెల 27 నుంచి రాజ్యాంగ ధ‌ర్మాసనం చేప‌ట్టే విచార‌ణ‌లు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం
  • విచార‌ణ‌ల ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంపై 2018లో సుప్రీంకోర్టు తీర్పు
constitutional bench hearings will live stream from 27th of this month

భార‌త స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో... రాజ్యాంగ ధ‌ర్మాస‌నం అత్యున్న‌త బెంచ్‌. కీల‌కమైన కేసుల‌ను విచార‌ణ చేప‌ట్టేందుకు భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి నేతృత్వంలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది జ‌డ్జీల‌తో కూడిన ఈ ధ‌ర్మాసనాన్ని ఏర్పాటు చేస్తుంటారు. ఈ ధ‌ర్మాస‌నం ఇక‌పై చేప‌ట్టే విచార‌ణ‌లన్నింటినీ మ‌నం ప్ర‌త్య‌క్షంగా చూడ‌వ‌చ్చు. సుప్రీంకోర్టు అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ ప్ర‌త్యేక ఏర్పాట్లు ఈ నెల 27 నుంచి అందుబాటులోకి రానున్నాయి. 

తెలుగు నేల‌కు చెందిన భార‌త మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ త‌న ప‌ద‌వీ విర‌మ‌ణ రోజున చేప‌ట్టిన విచార‌ణ‌ల‌ను సుప్రీంకోర్టు లైవ్‌లో పెట్టిన సంగ‌తి తెలిసిందే. అదే మాదిరిగా ఇక‌పై ఈ నెల 27 నుంచి సుప్రీంకోర్టులోని రాజ్యాంగ ధ‌ర్మాస‌నం చేప‌ట్టే ప్ర‌తి విచార‌ణ‌ను దేశ ప్రజ‌లంతా ప్ర‌త్య‌క్షంగానే వీక్షించ‌వ‌చ్చు. ఎప్పుడో 2018లో కోర్టు విచార‌ణ‌ల ప్రత్య‌క్ష ప్ర‌సారాల‌కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇన్నాళ్ల‌కు అమ‌లు అవుతోంది.

More Telugu News