Sri Vishnu: 'అల్లూరి' ఒప్పుకోవడానికి కారణమదే: శ్రీవిష్ణు

  • శ్రీవిష్ణు తాజా చిత్రంగా రూపొందిన 'అల్లూరి'
  • పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న శ్రీవిష్ణు
  • నిర్మాతగా బెక్కెం వేణుగోపాల్  
  • ఈ నెల 23వ తేదీన విడుదలవుతున్న సినిమా
Sri Vishnu Interview

మొదటి నుంచి కూడా శ్రీవిష్ణు విభిన్నమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'అల్లూరి' సినిమా వస్తోంది. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా థియేటర్లలో దిగిపోనుంది. బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించాడు. 

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో 'అల్లూరి' పాత్ర, శ్రీవిష్ణును ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా నడిపించారు. ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమాకి ముందు చేసిన రెండు సినిమాల్లోను దొంగ పాత్రనే చేశాను. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చేయడం కొత్తగా అనిపించింది. 

పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథలు గతంలో చాలానే వచ్చాయి. కానీ ఈ సినిమా ఒక పోలీస్ ఆఫీసర్ బయోపిక్. ఈ కథ వినగానే నేను ఈ సినిమాను ఒప్పుకోవడానికి కారణం ఇదే. కొత్తదనమున్న కథలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఈ సినిమాలోని ఈ పాత్ర కోసం నేను బరువు తగ్గడం .. పెరగడం చేశాను. ఆడియన్స్ పెట్టే డబ్బుకి రెట్టింపు వినోదాన్ని ఈ సినిమా ఇస్తుందని నేను నమ్మకంగా చెప్పగలను" అంటూ సమాధానమిచ్చాడు.

More Telugu News