India: దేశంలో నిలకడగా కరోనా వ్యాప్తి.. అప్డేట్స్ ఇవిగో!

  • గత 24 గంటల్లో 4,858 కరోనా కేసుల నమోదు
  • కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,735
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 48,858
India corona updates

దేశంలో కరోనా వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 4,858 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 4,735 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 48,027 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,39,62,664 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 5,28,355 మంది కరోనాతో మృతి చెందారు.  

దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2.76 శాతంగా, రికవరీ రేటు 98.71 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా, క్రియాశీల రేటు 0.11 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,16,70,14,127 డోసుల కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. నిన్న 13,59,361 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.     


More Telugu News