TTD: తిరుమలలో అన్నదానం పేరు చెప్పే ప్రైవేటు సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దు: టీటీడీ

  • ఈ నెల 27 నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు
  • ఉచితంగా అన్నప్రసాదం అందిస్తామన్న టీటీడీ
  • అక్రమంగా విరాళాలు సేకరిస్తే చర్యలుంటాయని హెచ్చరిక
  • అనంత గోవిందదాస ట్రస్టుతో తమకు సంబంధం లేదని వెల్లడి
TTD says do not give donations ti private organisations for free meals

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉచితంగా అన్నప్రసాదం అందజేస్తున్నామని టీటీడీ వెల్లడించింది. అన్నదానం పేరు చెప్పే ప్రైవేటు సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దని భక్తులకు స్పష్టం చేసింది. సికింద్రాబాద్ అనంత గోవిందదాస ట్రస్టుకు, తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ వెల్లడించింది. అక్రమంగా విరాళాలు సేకరించే ట్రస్టులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. 

కాగా, తిరుమల కొండ నుంచి ఇతర ప్రాంతాలకు టీటీడీ విద్యుత్ బస్సులు ప్రవేశపెడుతోంది. ఈ బస్సులను సీఎం జగన్ ఈ నెల 27న బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రారంభించనున్నారు. ఈ బస్సులు ఇప్పటికే అలిపిరి డిపోకు చేరుకున్నాయి. తిరుమల-తిరుపతి, తిరుపతి-రేణిగుంట ఎయిర్ పోర్టు మధ్య 64 బస్సులు... కడప, నెల్లూరు, మదనపల్లె పట్టణాలకు 12 చొప్పున ఈ విద్యుత్ ఆధారిత బస్సులను నడపనున్నారు.

More Telugu News