Justice Devanand: ఢిల్లీలో చదువుతున్న మా అమ్మాయిని మీ రాజధాని ఏదంటూ వేళాకోళం ఆడుతున్నారు: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్

  • విజయవాడలో అమృతభారతి పుస్తకావిష్కరణ
  • హాజరైన జస్టిస్ దేవానంద్
  • రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పులేకపోతున్నామని ఆవేదన
Justice Devanand talks about AP Capital

ప్రపంచ రచయితల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో అమృతభారతి పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ బట్టు చీఫ్ గెస్టుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఏపీ రాజధాని అంశాన్ని ప్రస్తావించారు. 

ఢిల్లీలో చదువుతున్న తన కుమార్తెను మీ రాజధాని ఏదంటూ అక్కడివారు వేళాకోళం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే మన రాష్ట్ర రాజధాని అని చెప్పుకోలేకపోతున్నామని విచారం వ్యక్తం చేశారు. మన పిల్లలు తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆక్రోశించారు. 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో, తెలుగువాళ్ల పరిస్థితి ఏంటన్నది పరిశీలన చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి అంశాన్ని కులం, రాజకీయం, స్వార్థ ప్రయోజనాలు పట్టిపీడిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి వైకల్యాలను రూపుమాపాల్సిన బాధ్యత రచయితలపైనే ఉందని అన్నారు.

More Telugu News