Cheetah: న‌మీబియా నుంచి భార‌త్‌కు చీతాలు ఇలా త‌ర‌లాయి!... విమానంలోని లోప‌లి దృశ్యాల వీడియో ఇదిగో!

  • న‌మీబియా నుంచి చీతాల‌ను తీసుకొచ్చిన వైనం
  • చీతా త‌ర‌లింపున‌కు బోయింగ్ విమానాన్ని వినియోగించిన ప్ర‌భుత్వం
bollywood actress Raveena Tandon shares a video of boeing flight visuals which transported chaatas to india

మ‌న దేశంలో దాదాపుగా అంత‌రించిపోయిన చీతాలు శ‌నివారం మ‌రోమారు దేశంలోకి ప్ర‌వేశించాయి. న‌మీబియా నుంచి 8 చీతాల‌ను విమానం ద్వారా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చింది. వాటిని మధ్యప్రదేశ్ లోని కునో-పాల్పూర్ నేషనల్ పార్క్‌లో స్వ‌యంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ వ‌దిలిపెట్టారు. ఈ దృశ్యాలు శ‌నివారం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌గా మారాయి. అడ‌వే జ‌న్మ‌స్థ‌లంగా, అడ‌వే ఆట‌స్థ‌లంగా, అడ‌వే ఆట‌విడుపుగా సాగే చీతాల‌ను ఏదేనీ వాహ‌నం ఎక్కించ‌డ‌మంటేనే చాలా క‌ష్ట‌మైన ప‌ని. అలాంటిది చీతాలు ఏకంగా వేల మైళ్ల దూరం విమానంలో ప్ర‌యాణించాయంటే ఆస‌క్తి రేకెత్తించేదే క‌దా. 

అడ‌వి జంతువుల‌ను త‌ర‌లించ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని అయినా... దేశంలో చీతాల‌కు ఎంట్రీ ఇప్పించే దిశ‌గా న‌రేంద్ర మోదీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకోగా... వాటి త‌ర‌లింపున‌కు ఏకంగా బోయింగ్ విమానాన్నే వినియోగించాల్సి వ‌చ్చింది. ఆ బోయింగ్ విమానంలో చీతాల‌ను ఎలా త‌ర‌లించారు? అన్న విష‌యాన్ని తెలియ‌జెబుతున్న ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారింది. చీతాల‌ను బాక్సుల్లో ఉంచి... వాటిని బోయింగ్ విమానంలో ఎక్కించి... అవి అటూ ఇటూ క‌ద‌ల‌కుండా ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు చాలా జాగ్ర‌త్త‌గా దేశానికి త‌ర‌లించారు. చీతాల‌ను ఉంచిన బాక్సుల్లోని దృశ్యాల‌ను చూపిస్తూ మ‌రో వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

More Telugu News