Johnson and Johnson: జాన్స‌న్స్ బేబీ పౌడ‌ర్ లైసెన్సును రద్దు చేసిన మహారాష్ట్ర

  • లైసెన్స్ రద్దు చేసిన మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్
  • పాడర్ వల్ల శిశువుల చర్మాలపై వస్తున్న ఇన్ఫెక్షన్
  • పిల్లల ఆరోగ్యం దృష్ట్యా లైసెన్స్ రద్దు
Maharashtra cancels Johnson and Johnson baby powder licence

జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి మహారాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. బేబీ పౌడర్ ఉత్పత్తి లైసెన్స్ ను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ రద్దు చేసింది. ఈ పౌడర్ వల్ల శిశువుల చర్మాలపై ఇన్ఫెక్షన్ వస్తోందని తెలిపింది. ల్యాబ్ పరీక్షల సమయంలో కూడా పీహెచ్ విలువ స్టాండర్డ్ గా లేదని పేర్కొంది. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా లైసెన్స్ ను రద్దు చేసినట్టు తెలిపింది. కోల్ కతాకు చెందిన సెంట్రల్ డ్రగ్స్ ల్యాబ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. పూణె, నాసిక్ ల నుంచి శాంపిల్స్ ను సేకరించి పరీక్షలను నిర్వహించారు.

More Telugu News