Un stoppable: 'దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..' అంటున్న బాలకృష్ణ

  • అన్‌స్టాప‌బుల్ రెండో సీజ‌న్‌పై ఆహా ప్ర‌క‌ట‌న‌
  • అతి త్వ‌ర‌లో ప్రారంభం అవుతుందంటూ పోస్ట‌రీ విడుద‌ల‌
  • తొలి సీజ‌న్ లో త‌న హోస్టింగ్ తో షోను సూప‌ర్ స‌క్సెస్ చేసిన బాల‌య్య‌ 
Un stoppable With NBK2 coming soon

సీనియ‌ర్ హీరో నంద‌మూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారి చేసిన ‘అన్ స్టాపబుల్’  ప్రోగ్రాం తెలుగు టాక్ షోస్ లో సంచ‌ల‌నంగా మార‌డ‌మే కాకుండా అతి పెద్ద విజ‌యం సాధించింది. వెండితెర‌పై త‌న యాక్ష‌న్ తో అభిమానుల‌ను ఉర్రూత‌లూగించే బాల‌య్య ఈ షోలో త‌న కామెడీ టైమింగ్ తో వీక్ష‌కుల‌ను మైమ‌ర‌పించారు. త‌న మార్కు అల్ల‌రితో పాటు, పంచ్ డైలాగ్స్ తో  షోను సూప‌ర్ స‌క్సెస్ చేశారు. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమ్ అయిన అన్‌స్టాప‌బుల్ లో ప‌లువురు సెల‌బ్రిటీల‌ను అతిథులుగా పిలిచి బాల‌య్య చేసిన సంద‌డిని అభిమానులు అంత ఈజీగా మ‌రిచిపోవ‌డం లేదు.

తొలి సీజ‌న్ ముగిసి చాన్నాళ్లు కావ‌డంతో  అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆహా వారిలో ఉత్సాహం నింపింది. అన్‌స్టాప‌బు‌ల్ రెండో సీజ‌న్ అతి త్వ‌ర‌లో ముందుకు వ‌స్తోందంటూ ట్విట్ట‌ర్ లో వెల్ల‌డించింది. అయితే, కొత్త సీజ‌న్ స్ట్రీమింగ్ తేదీని మాత్రం ఇంకా పేర్కొనలేదు. పండ‌గ త్వరలోనే మొద‌వుతుంది... అంటూ హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. ఈ నేప‌థ్యంలో ద‌సరా లేదా దీపావ‌ళికి కొత్త సీజ‌న్ ప్రారంభం అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. దెబ్బ‌కు థింకింగ్ మారిపోవాలా అంటూ బాల‌య్య మార్కు డైలాగ్ మాదిరి హ్యాష్‌ట్యాగ్ ను జ‌త చేసింది.

More Telugu News