Jignesh Mevani: పాత కేసులో గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీకి ఆరు నెలల జైలుశిక్ష

  • 2016లో నిరసన ప్రదర్శనలు చేపట్టిన మేవానీ
  • ఈ సందర్భంగా జరిగిన ఘటనలపై కేసు
  • విచారించిన అహ్మదాబాద్ కోర్టు
  • మేవానీ, మరో 18 మందికి జైలుశిక్ష
Ahmedabad court sentenced Jignesh Mevani for six months jail term

గుజరాత్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జిగ్నేశ్ మేవానీకి 2016 నాటి ఓ కేసులో కోర్టు శిక్ష విధించింది. గుజరాత్ యూనివర్సిటీలోని లా భవన్ కు అంబేద్కర్ పేరుపెట్టాలంటూ జిగ్నేశ్ మేవానీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆ సమయంలో చోటుచేసుకున్న ఘటనలపై కేసు నమోదైంది. 

అప్పటి కేసును విచారించిన అహ్మదాబాద్ కోర్టు జిగ్నేశ్ మేవానీ, మరో 18 మందికి 6 నెలల జైలు శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించి గతంలో మొత్తం 20 మందిని అరెస్ట్ చేయగా, వారిలో ఒకరు మరణించారు. మిగిలినవారికి కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 

కాగా, జిగ్నేశ్ మేవానీపై ఇటీవల అహ్మదాబాద్ లో దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది మాజీ హోంమంత్రి ప్రదీప్ సింగ్ జడేజాకు చెందిన గూండాలేనని మేవానీ టీమ్ ఆరోపించింది.

More Telugu News