AP Assembly Session: ఏపీ అసెంబ్లీలో కడప స్టీల్ ప్లాంట్ పై వాడీవేడీ చర్చ..  కొవిడ్ వల్ల స్టీల్ పరిశ్రమ డౌన్ అయిందన్న మంత్రి బుగ్గన

  • సొంత జిల్లాలోని స్టీల్ ప్లాంట్ ను సీఎం పట్టించుకోలేదన్న టీడీపీ
  • కరోనా వల్ల ప్రపంచమే కుదేలయిందన్న బుగ్గన
  • రెండేళ్లు కరోనాతోనే గడిచిపోయిందని వ్యాఖ్య
Steel industry suffered with Covid says Buggan in AP Assembly

ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది. కడప స్టీల్ ప్లాంట్ పై టీడీపీ ఇచ్చిన ప్రశ్నపై ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య వాగ్వాదం జరుగుతోంది. జగన్ సీఎం అయి మూడేళ్లవుతున్నా ఇంత వరకు ప్లాంటు నిర్మాణాన్ని చేపట్టలేదని విమర్శించారు. సొంత జిల్లాలోని ప్లాంటు నిర్మాణాన్ని కూడా ఆయన పట్టించుకోలేదని అన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ... కరోనా వల్ల ప్రపంచమే కుదేలయిందని, స్టీల్ పరిశ్రమ పూర్తిగా డౌన్ అయిందని చెప్పారు. రెండేళ్లు కరోనాతోనే గడిచిపోయిందని అన్నారు. ఈ విషయాలు తెలుసుకోకుండా టీడీపీ సభ్యులు విమర్శించడం సరికాదని చెప్పారు. 

మరోవైపు ఈరోజు ఎనిమిది బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. వీటిలో పంజాయతీరాజ్ సవరణ బిల్లు, రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లు, సివిల్ సర్వీసెస్ రిపీల్ బిల్లు, ల్యాండ్ టైటిలింగ్ బిల్లు, యూనివర్శిటీల చట్ట సవరణ బిల్లు, ఇండియన్ స్టాంప్స్ సవరణ బిల్లు, ఆర్జీయూకేటీ సవరణ బిల్లు, అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ సవరణ బిల్లు ఉన్నాయి.

More Telugu News