Sudheer Babu: కృతి ముందు అవకాశాలు క్యూ కట్టడం ఖాయం: సుధీర్ బాబు

  • రేపు రిలీజ్ అవుతున్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సుధీర్ బాబు 
  • ఇంద్రగంటితో ఇది మూడో సినిమా
  • సంగీత దర్శకుడిగా వివేక్ సాగర్  
Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Update

సుధీర్ బాబు -  కృతి శెట్టి జంటగా నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా, ఈ నెల 16వ తేదీన థియేటర్లకు  రానుంది. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "ఇంద్రగంటి గారు నా కోసం ఈ కథను రాయలేదు. ఆయన కథకు నేను సెట్ అయ్యానంతే. ఆయనతో మూడో సినిమా కూడా చేసే అవకాశం రావడం నా అదృష్టం. 

ఈ సినిమాలో కృతి శెట్టి పాత్ర చాలా బాగుంటుంది. ఆమె పాత్ర .. నటన ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి. 'ఉప్పెన' తరువాత ఆమెకి ఎలా అవకాశాలు వచ్చి పడ్డాయో, అలాగే ఈ సినిమా తరువాత అవకాశాలు 'క్యూ'కడతాయి. ఇక వివేక్ సాగర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నాను" అన్నాడు. 

ఒకసారి డైరెక్షన్ అంటే ఇష్టమని చెప్పాను. అప్పటి నుంచి అందరూ ఆ విషయాన్ని అడుగుతున్నారు. ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదు. ప్రస్తుతం రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఆ తరువాత సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయిగానీ, ఇంతవరకైతే ఏ ప్రాజెక్టును ఒప్పుకోలేదు" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News