TDP: అమ‌రావ‌తి అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి నారాయ‌ణ‌కు ముంద‌స్తు బెయిల్ మంజూరు

  • అమ‌రావ‌తి అసైన్డ్ భూముల కుంభ‌కోణంలో నిన్న ఐదుగురిని అరెస్ట్ చేసిన సీఐడీ
  • ముంద‌స్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్ర‌యించిన నారాయ‌ణ‌
  • వైద్య చికిత్స‌ల కోసం విదేశాలు వెళ్లాల్సి ఉంద‌న్న మాజీ మంత్రి
  • నారాయ‌ణ‌కు 3 నెల‌ల పాటు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు
ap high court issues interim bail to tdp leader narayana

టీడీపీ నేత‌, మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌కు ఏపీ హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలోని అసైన్డ్ భూముల కుంభ‌కోణంలో కీల‌క నిందితుడిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నారాయ‌ణ‌కు 3 నెల‌ల పాటు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు బుధ‌వారం కీల‌క తీర్పు చెప్పింది. ఈ కేసులో మంగ‌ళ‌వార‌మే ఏపీ సీఐడీ పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ కేసులో త‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాలంటూ నారాయ‌ణ హైకోర్టును ఆశ్ర‌యించారు.

ఈ పిటిష‌న్‌పై బుధ‌వారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు నారాయ‌ణ‌కు 3 నెల‌ల పాటు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది. విచార‌ణ సంద‌ర్భంగా అనారోగ్యంతో బాధప‌డుతున్న నారాయ‌ణ విదేశాల్లో చికిత్స తీసుకోవాల్సి ఉంద‌ని ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. ఇదే అంశం ఆధారంగా ఇదివ‌ర‌కే ఓ కేసులో హైకోర్టే నారాయ‌ణ‌కు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింద‌ని తెలిపారు. అయితే ఈ కేసులో కీల‌క నిందితుడిగా ఉన్నందున నారాయ‌ణ‌కు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేయరాద‌ని ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టును కోరారు. ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న కోర్టు నారాయ‌ణ‌కు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది.

More Telugu News