Azharuddin: భార‌త టీ20 జ‌ట్టు ఎంపిక‌ను ప్ర‌శ్నించి, ట్విట్ట‌ర్‌లో ట్రోల్ అవుతున్న మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌

  • జ‌ట్టులో మ‌హ్మ‌ద్ ష‌మీ, శ్రేయ‌స్ అయ్యర్ ఉండాల‌ని అభిప్రాయ‌ప‌డ్డ అజార్‌
  • దీప‌క్ హుడా స్థానంలో శ్రేయ‌స్, హ‌ర్ష‌ల్ బ‌దులు ష‌మీని తీసుకోవాల్సింద‌ని ట్వీట్ 
  • ఆస్ట్రేలియా బౌన్సీ పిచ్‌ల‌పై శ్రేయ‌స్ ను ఎలా ఆడించాలంటూ నెటిజ‌న్ల ఎద్దేవా
Azharuddin endlessly trolled for tweet on Iyer Shami and Indias T20 WC team

భారత టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపిక‌ను ప్రశ్నిస్తూ మాజీ కెప్టెన్ మ‌హ్మ‌ద్‌ అజారుద్దీన్ చేసిన ట్వీట్ అభిమానులకు అంతగా రుచించ‌లేదు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ న‌కు శ్రేయ‌స్ అయ్య‌ర్ ను ఎంపిక చేయాల్సింద‌న్న అజార్ ను నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. షార్ట్ పిచ్ డెలివరీలను ఎదుర్కోవ‌డంలో బ‌ల‌హీన‌త ఉన్న శ్రేయ‌స్ ఆస్ట్రేలియాలోని బౌన్సీ ట్రాక్‌లపై ఎలా ఆడ‌గ‌ల‌డ‌ని ప్ర‌శ్నిస్తున్నారు.  

ఆసియా కప్ లో తీవ్రంగా నిరాశ ప‌రిచిన నేప‌థ్యంలో రోహిత్ శర్మ నేతృత్వంలోని భార‌త్ వ‌చ్చే నెల‌లో జ‌రిగే ప్రపంచ క‌ప్ లో ఎలాగైనా స‌త్తా చాటాల‌ని చూస్తోంది. ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగే ఈ టోర్నీ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన జ‌ట్టును సోమ‌వారం ప్ర‌క‌టించింది. అయితే, ఈ జ‌ట్టులో ఇద్ద‌రు ఆట‌గాళ్లు లేక‌పోవ‌డం తన‌కు ఆశ్చ‌ర్యం క‌లిగించింద‌ని అజార్ అన్నాడు. 

"ప్రధాన జట్టు నుండి శ్రేయస్ అయ్యర్, షమీని తప్పించడం ఆశ్చర్యంగా ఉంది" అని అజహర్ ట్వీట్ చేశాడు. ఆల్ రౌండర్ దీపక్ హుడా స్థానంలో అయ్యర్‌ను ఎంపిక చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. హర్షల్ పటేల్ స్థానంలో షమీ ఉండాల్సింద‌న్నాడు. 

అయితే, అజారుద్దీన్ చేసిన ట్వీట్ కొంద‌రు అభిమానులకు అంతగా నచ్చలేదు. ముఖ్యంగా షార్ట్ పిచ్ డెలివరీలను స‌రిగ్గా ఆడ‌లేని అయ్య‌ర్‌ను ఆస్ట్రేలియా పంపాల‌న‌డం అజార్ అవివేకం అని ట్రోల్ చేస్తున్నారు. ఇంత అనుభ‌వం వున్న వ్య‌క్తికి టీమ్ ఎంపిక‌పై ఎలా స్పందించాలో తెలియ‌దా? అని ఓ వ్య‌క్తి ట్వీట్ చేశాడు. శ్రేయ‌స్ ముందు నుంచి స్టాండ్ బైగానే ఉన్న‌ప్పుడు అత‌డిని తుది జ‌ట్టు నుంచి త‌ప్పించార‌ని ఎలా అంటార‌ని మ‌రో వ్య‌క్తి ప్ర‌శ్నించాడు.

More Telugu News