Narendra Modi: సికింద్రాబాద్ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మోదీ

  • సికింద్రాబాద్ లోని రూబీ లాడ్జ్ లో అగ్నిప్రమాదం
  • పలువురు మృతి చెందడం బాధిస్తోందన్న మోదీ
  • చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన పీఎం
Modi condolences to Secunderabad fire accident death families

సికింద్రాబాద్ లోని రూబీ లాడ్జ్ సెల్లార్ లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. సెల్లార్ లోని ఎలెక్ట్రిక్ స్కూటర్ల షోరూంలో ఈ-బైకులు పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. లాడ్జిలోని మొదటి, రెండో ఫ్లోర్లలో ఉన్న వారు ఊపిరి ఆడక చనిపోయినట్టు తెలుస్తోంది. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పై నుంచి కిందకు దూకిన కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.

 మరోవైపు, ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలంగాణలోని సికింద్రాబాద్ లో సంభవించిన అగ్నిప్రమాదంలో పలువురు చనిపోవడం బాధను కలిగిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చనిపోయిన వారి కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని చెప్పారు. గాయపడిన వారికి రూ. 50 వేలు చెల్లిస్తామని తెలిపారు.

More Telugu News