Chiranjeevi: 'వాల్తేర్ వీరయ్య' సినిమాలో అతిథి పాత్రలో వెంకీ?

  • 'వాల్తేర్ వీరయ్య'గా చిరంజీవి
  • షూటింగు దశలో ఉన్న ప్రాజెక్టు
  • కీలకమైన పాత్రలో రవితేజ 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ  
Valther Veerrayya movie update

చిరంజీవి కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి మూడు సినిమాలు ముస్తాబవుతున్నాయి. ఆ సినిమాలలో 'వాల్తేర్ వీరయ్య' ఒకటి. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగు పనులు చకచకా జరిగిపోతున్నాయి.

ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, ఒక కీలకమైన పాత్రను రవితేజ పోషిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోకి సవతి తల్లి కొడుకుగా రవితేజ కనిపించనున్నాడు. ఆయన పాత్ర వైపు నుంచి కూడా యాక్షన్ - ఎమోషన్ ఉండనున్నట్టుగా చెబుతున్నారు. ఇక ఈ సినిమా చివరిలో అతిథి పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నారనేది తాజా సమాచారం.

మెగాస్టార్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా వెంకీ ఈ సినిమాలోని ఒక సరదా సందర్భంలో మెరవడానికి ఓకే చెప్పారని అంటున్నారు. ఈ విషయాన్ని గురించిన అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, సముద్రఖని .. బాబీ సింహా .. కేథరిన్ ముఖ్యమైన పాత్రలలో సందడి చేయనున్నారు.

More Telugu News