Amaravati: వెంకటపాలెంలోని టీటీడీ ఆలయంలో అమరావతి రైతుల ప్రత్యేక పూజలు.. 9 గంటలకు మహాపాదయాత్ర ప్రారంభం

  • అమరావతి ఉద్యమానికి నేటితో 1000 రోజులు
  • పూజల అనంతరం రథాన్ని గ్రామంలోకి తీసుకెళ్లిన రైతులు
  • కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత చింతమనేని
  • నవంబరు 11న అరసవల్లిలో యాత్రకు ముగింపు
Amaravati Farmers Maha Padayatra starts at 9 am Today

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ జరగుతున్న ఉద్యమానికి నేటితో 1000 రోజులు. ఈ సందర్భంగా చేపట్టనున్న మహాపాదయాత్ర 2.0కు ఈ ఉదయం అంకురార్పణ జరిగింది. ఈ తెల్లవారుజామున వెంకటపాలెంలోని టీటీడీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రైతులు అనంతరం ఆలయం బయట ఉన్న వేంకటేశ్వరస్వామి వారి రథాన్ని నడిపి పాదయాత్రకు అంకురార్పణ చేశారు. అనంతరం రథాన్ని గ్రామంలోకి తీసుకెళ్లారు. 

ఉదయం 9 గంటలకు జెండా ఊపి పాదయాత్రను లాంఛనంగా ప్రారంభిస్తారు. అంకురార్పణ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అమరావతి పరిరక్షణ సమితి, రైతు జేఏసీ నేతలు పాల్గొన్నారు. కాగా, మరికాసేపట్లో వెంకటపాలెంలో ప్రారంభం కానున్న రైతుల మహాపాదయాత్ర 1000 కిలోమీటర్లు సాగి నవంబరు 11న శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయానికి చేరుకుంటుంది.

More Telugu News