Joe Biden: క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు వెళ్తున్నా: జో బైడెన్

  • రాణి అంత్యక్రియలకు చెందిన సమాచారం తనకు తెలియదన్న బైడెన్
  • ఈ నెల 19న జరిగే అవకాశం ఉందని భావిస్తున్నానని వ్యాఖ్య
  • కింగ్ చార్లెస్ కు ఫోన్ చేయలేదన్న బైడెన్
Iam going to Queen Elezabeth funerals says Joe Biden

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వీరి అంత్యక్రియలకు పెద్ద ప్రక్రియ ఉంటుంది. మరోవైపు రాణి అంత్యక్రియలకు హాజరవుతానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. క్వీన్ అంత్యక్రియలకు సంబంధించిన సమాచారం తనకు తెలియదని... ఈ నెల 19న లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ... అంత్యక్రియలకు మాత్రం తప్పకుండా హాజరవుతానని తెలిపారు. క్వీన్ ఎలిజబెత్ కుమారుడు కింగ్ చార్లెస్ 3 కూడా తనకు తెలుసని చెప్పారు. అయితే, ప్రస్తుత విషాదకర పరిస్థితుల్లో ఆయనకు ఫోన్ చేయలేదని తెలిపారు.

More Telugu News