Hyderabad: గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో... హైదరాబాదులో రెండ్రోజుల పాటు మద్యం దుకాణాల మూసివేత

  • సెప్టెంబరు 9న హైదరాబాదులో గణేశ్ నిమజ్జనం
  • రేపు, ఎల్లుండి మద్యం దుకాణాల బంద్
  • పోలీసు శాఖ ఆదేశాలు
  • మూడు కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు
Two days liquor sales halt in Hyderabad

హైదరాబాద్ లో రేపు (సెప్టెంబరు 9) గణేశ్ నిమజ్జన కార్యక్రమం షురూ కానుంది. ఈ నేపథ్యంలో, నగరంలో రెండ్రోజుల పాటు వైన్ షాపులు, కల్లు దుకాణాలు మూసివేయాలని పోలీసు శాఖ ఆదేశించింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు జరపరాదని పోలీసులు స్పష్టం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. రేపు, ఎల్లుండి మద్యం దుకాణాల మూసివేత నేపథ్యంలో, ఈ సాయంత్రం నుంచి నగరంలోని వైన్ షాపుల వద్ద సందడి పెరిగినట్టు తెలుస్తోంది. కాగా, గణేశ్ నిమజ్జనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పట్లానే భారీ ఏర్పాట్లు చేసింది.

More Telugu News