Balance man: సీసాపై రెంచ్.. దానిపై బాటిల్.. ఆపై డ్రిల్ మిషిన్.. ఏదైనా నిలబెట్టేయడమే.. వైరల్ వీడియోలు ఇవిగో

  • చైనాకు చెందిన ‘పేషెన్స్‌ ఆర్టిస్ట్‌’ వాంగ్‌ యెకున్‌ ప్రతిభ ఇది
  • బీరు సీసాలపై సైకిల్‌ గాలిలో తేలేలా నిలబెట్టే సామర్థ్యం
  • గంటలకు గంటలు ప్రయత్నించి మరీ సాధించే ఓపిక
Mans ability to balance various objects seems to defy laws of physics

మనం చిన్నప్పుడు ఓ వస్తువుపై మరో వస్తువును నిలబెట్టడానికి ప్రయత్నించే ఉంటాం. పేక ముక్కలను పడిపోకుండా కోటల్లా కట్టేందుకు ప్రయత్నించేవారూ ఎందరో.. ఇక అక్కడక్కడా నాణాలను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు కూడా. నిమిషాలకు నిమిషాలు ప్రయత్నించినా ఓ చిన్న నాణెం కూడా సరిగా నిలబెట్టలేకపోతుంటాం. కానీ చైనాలోని షాండోంగ్‌ ప్రావిన్స్‌ కు చెందిన వాంగ్‌ యెకున్‌ మాత్రం.. ఈ కళలో సిద్ధహస్తుడు. ఎంతగా అంటే సీసీలపై రెంచ్‌ లు, వాటిపై మళ్లీ సీసాలు, వాటిపై బరువైన వస్తువులు.. ఇలా ఎన్నో నిలబెట్టేస్తుంటాడు.

గంటలకు గంటలు వేచి చూసి మరీ..

  • సాధారణంగా వస్తువుపై వస్తువును నిలబెట్టాలంటే ఓపికగా ప్రయత్నించాలి. ఎంతో సహనం ఉండాలి. వాంగ్‌ యెకున్‌ కు ఓపిక, సహనం రెండూ ఎక్కువే. ఎంత ఎక్కువంటే.. ఒక్కోసారి ఇలా వస్తువులను నిలబెట్టడానికి గంటలకు గంటలు ఒకే చోట కూర్చుని ప్రయత్నిస్తుంటాడు.
  • 2017లో ఇలా బ్యాలెన్సింగ్‌ చేయడం మొదలుపెట్టిన ఆయన.. మెల్లగా ఈ కళలో ఆరితేరిపోయాడు. తర్వాత వస్తువులను వేగంగా బ్యాలెన్స్‌ చేసే సామర్థ్యం వచ్చేసింది.
  • ఓ చిన్న రాడ్‌ ఆధారంగా బరువైన సిలిండర్‌ ను గాల్లో నిలబెట్టడం.. ఒకదానిపై ఒకటి అడ్డంగా, నిలువుగా ఆరు బీరు సీసాలను బ్యాలెన్స్‌ చేయడం.. కేవలం సీసాల ఆధారంగా సైకిల్‌ ను గాలిలో తేలేలా నిలబెట్టడం వంటివి చూస్తే.. ఆయన నైపుణ్యం ఏమిటో అర్థమైపోతుంది.
  • అంతేకాదు.. మనుషులను కుర్చీల్లో కూర్చోబెట్టి వాటిని వంకర, టింకరగా నిలబెట్టి బ్యాలెన్స్‌ చేయడం వంటివీ ఎన్నో చేస్తుంటాడు.
  • దీనికి సంబంధించి వాంగ్‌ యెకున్‌ వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటాడు కూడా.
  • ఇతని ఓపికను చూసి చాలా మంది ‘పేషెన్స్‌ ఆర్టిస్ట్‌’ అని పేరుపెట్టేశారు. 
  • మన దేశంలో టిక్‌ టాక్‌ ను నిషేధించారుగానీ.. ఆ యాప్‌ లో ఈయనకు కోట్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.
  • ‘‘వస్తువులనే కాదు.. మన జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకోవడం కూడా ఒక ఆర్ట్‌. కొన్నిసార్లు ఇది సీరియస్‌ గా ఉంటే.. మరికొన్ని సార్లు సరదాగా ఉంటుంది అంతే తేడా..’’ అని వాంగ్‌ యెకున్‌ నవ్వుతూ చెబుతుంటాడు.



 
 

More Telugu News