Gold: కిచెన్‌ రిపేర్‌ చేయిస్తుంటే.. బంగారు నాణాలు బయటపడ్డాయి!

  • చిన్నపాటి డబ్బాలో 260 బంగారు నాణాలను గుర్తించిన కుటుంబం
  • ఇంగ్లండ్‌ నార్త్‌ యార్క్‌ ఫైర్‌ లోని ఎల్లెర్‌ బీ గ్రామంలో ఘటన
  • ఈ నెల రెండో వారంలో వేలం వేయనున్న స్పింక్‌ సంస్థ
Gold coins discovered under kitchen floorboards in england

గుప్త నిధులు.. తవ్వకాలు.. అంటూ తరచూ వార్తలు వస్తుంటాయి. తమకూ అలా బంగారం దొరికితే బాగుంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు కూడా. కానీ ఓ ఫ్యామిలీకి మాత్రం అలా అనుకోకుండానే అలా నిధి లాంటి బంగారం దొరికింది. పాత ఇంట్లో వంట గది పాడైపోయిందని రినోవేషన్‌ చేయిస్తుంటే.. కలపతో చేసిన ఫ్లోరింగ్‌ కింద ఓ చిన్నపాటి రేకు డబ్బా బయటపడింది. అదేమిటని తీసి చూస్తే.. మిలమిలా మెరిసే బంగారు నాణాలు బయటపడ్డాయి. యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ లోని నార్త్‌ యార్క్‌ షైర్‌ పరిధిలోని ఎల్లెర్‌ బీ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

మూడు వందల ఏళ్ల కిందటివి

  • చెక్క ఫ్లోరింగ్‌ కింద దొరికిన డబ్బాలో మొత్తం 260 నాణాలను గుర్తించారు. వాటిని పరిశీలించగా.. 1720వ సంవత్సరంలో బ్రిటన్‌ పాలకులు జారీ చేసిన 50 పౌండ్లు, 100 పౌండ్ల బంగారు నాణాలుగా గుర్తించారు.
  • అందులో నాడు చలామణీలో ఉన్న బ్రెజిల్‌ బంగారు నాణెం కూడా ఉంది. మొత్తంగా ఈ నాణాలను లండన్‌ కు చెందిన స్పింక్‌ సంస్థ వేలం వేయనుంది.
  • వేలం కోసం ఒక్కో బంగారు నాణానికి కనీస మొత్తంగా రూ.40వేల నుంచి రూ.లక్ష రూపాయల దాకా ధర నిర్ణయించారు. మొత్తం 260 నాణాలను వేలం వేయనున్నారు.
  • అన్ని నాణాలకు కలిపి కనీస మొత్తంగా మూడు లక్షల డాలర్లు (సుమారు రెండున్నర కోట్లు) ధర నిర్ణయించారు. పాత నాణాలు కాబట్టి.. వేలంలో పాల్గొనే వారిని బట్టి వీటికి ధర పెరిగే అవకాశం ఉంటుందని వేలం సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.

More Telugu News