AAP: 14 వేలు కాదు.. 10 ల‌క్ష‌ల స్కూళ్ల‌ను ఎంపిక చేయండి: ప్ర‌ధాని మోదీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ

  • ఉపాధ్యాయ దినోత్స‌వం నాడు పీఎం శ్రీ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించిన మోదీ
  • ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను మోడ‌ల్ స్కూళ్లుగా మారుస్తామ‌ని వెల్ల‌డి
  • దేశంలో 10 ల‌క్ష‌ల పాఠ‌శాల‌లు ఉన్నాయంటూ ప్ర‌ధానికి లేఖ రాసిన కేజ్రీవాల్‌
delhi cm arvind kejriwal writes a letter to pm modi over pn shri yojana

దేశంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల రూపు రేఖ‌లు మార్చే దిశ‌గా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఉపాధ్యాయ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని పీఎం శ్రీ ప‌థ‌కాన్ని ప్ర‌కటించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌థ‌కం అమ‌లుకు బుధ‌వారం నాటి కేంద్ర కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేసింది. ఈ ప‌థ‌కం కింద దేశంలోని 14 వేల పాఠ‌శాల‌ల‌ను మోడల్ స్కూళ్లుగా మారుస్తామ‌ని ప్ర‌ధాని ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న‌పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ బుధ‌వారం స్పందించారు. ఈ ప‌థ‌కం అమ‌లుకు సంబంధించి ఆయ‌న ప్ర‌ధానికి ఓ లేఖ కూడా రాశారు.

దేశంలో ప్ర‌భుత్వ రంగంలో 10 ల‌క్ష‌ల పాఠ‌శాల‌లు ఉన్నాయ‌ని ఆ లేఖ‌లో కేజ్రీవాల్ గుర్తు చేశారు. ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించిన ప‌థ‌కం ద్వారా ఐదేళ్ల‌లో 14,500 పాఠ‌శాల‌లు అభివృద్ధి చెందితే... మిగిలిన ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు అలా మార‌డానికి వందేళ్ల కంటే అధికంగా స‌మ‌యం ప‌డుతుంద‌ని ఆయ‌న తెలిపారు. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని 14 వేల పాఠ‌శాల‌ల‌కు బ‌దులుగా మొత్తంగా దేశంలోని 10 ల‌క్ష‌ల పాఠశాల‌ల‌ను ఈ ప‌థ‌కం కింద ఎంపిక చేయాల‌ని ఆయ‌న ప్ర‌ధానిని కోరారు.

More Telugu News