Andhra Pradesh: ఏపీ ప్ర‌భుత్వానికి స‌మ్మె నోటీసు ఇచ్చిన గ్రామ‌ పంచాయ‌తీ ఉద్యోగులు

  • 9 డిమాండ్ల‌తో స‌మ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగుల సంఘం
  • డిమాండ్లు ప‌రిష్క‌రించ‌కుంటే అక్టోబ‌ర్ 2 నుంచి నిర‌వ‌ధిక స‌మ్మె త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిక‌
  • క‌నీస వేత‌నాల‌ను రూ.20 వేల‌కు పెంచాల‌ని డిమాండ్‌
ap gram panchayath employees committee giver strike notice to government

ఏపీలో గ్రామ‌ పంచాయ‌తీ శాఖ ఉద్యోగులు స‌మ్మె బాట ప‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ మేర‌కు సోమ‌వారం రాష్ట్ర గ్రామ‌ పంచాయ‌తీ శాఖ ఉద్యోగుల సంఘం ప్ర‌భుత్వానికి స‌మ్మె నోటీసు ఇచ్చింది. ఈ నోటీసులో 9 ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించిన ఉద్యోగుల సంఘం... వాటిని త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేసింది. లేని ప‌క్షంలో అక్టోబ‌ర్ 2 నుంచి నిర‌వ‌ధిక స‌మ్మెకు దిగుతామ‌ని హెచ్చ‌రించింది. 

ఉద్యోగుల‌కు ఉన్న బ‌కాయిల‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని కోరిన ఉద్యోగుల సంఘం.. గ్రామ పంచాయ‌తీ ఉద్యోగులు, గ్రీన్ అంబాసిడ‌ర్‌ల‌కు క‌నీస వేత‌నం ఇవ్వాల‌ని కోరింది. క‌నీస వేతనంగా రూ.20 వేల‌ను చెల్లించాల‌ని డిమాండ్ చేసింది. నెల‌కు రూ.6 వేల చొప్పున ఆక్యుపేష‌న‌ల్ హెల్త్‌ అల‌వెన్స్ ఇవ్వాల‌ని కోరింది. పంచాయ‌తీ కార్మికుల‌ను తొల‌గించ‌డాన్ని త‌క్ష‌ణ‌మే నిలిపివేయాల‌ని డిమాండ్ చేసింది. ఉద్యోగ భ‌ద్ర‌త‌ను క‌ల్పించి రిటెర్మెంట్ బెనిఫిట్స్‌ను అందించాల‌ని ఉద్యోగుల సంఘం కోరింది.

More Telugu News