flipcart: 80 శాతం డిస్కౌంట్స్​తో వస్తున్న ఫ్లిప్​ కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’... ఎప్పటి నుంచి అంటే!

  • త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించిన ఈ కామర్స్ దిగ్గజం
  • ఈ నెల 23-30 మధ్య సేల్ నిర్వహించే అవకాశం
  • అన్ని రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్స్, డీల్స్ ఇవ్వనున్న సంస్థ
Flip cart announces big billion days sale

పండగ కోసం ఆన్ లైన్ షాపింగ్ చేయాలనుకుంటున్నా? అయితే కొన్ని రోజులు ఆగండి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్లతో త్వరలో 'ది బిగ్ బిలియన్ డేస్' సేల్ నడపనుంది. స్మార్ట్ ఫోన్ నుంచి స్మార్ట్ టీవీ వరకు అన్నింటిపై భారీ డిస్కౌంట్లు ఇవ్వనుంది. ఫ్లిప్‌కార్ట్‌ సైట్‌లో దీనికి సంబంధించిన ప్రకటన వస్తోంది. సేల్ ఎప్పటినుంచి ఎప్పటివరకు ఉంటుందనేది ఫ్లిప్ కార్ట్ ఇంకా వెల్లడించలేదు. ఈ ఆఫర్ కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ ఈ నెల 23 నుంచి 30 వరకు ఉండనుంది.  సేల్స్ లో అందుబాటులో ఉండే ఆఫర్స్, డీల్స్, డిస్కౌంట్స్‌ ను ఫ్లిప్ కార్ట్ ముందుగానే వెల్లడించింది. రూ.99 విలువ చేసే చిన్న చిన్న వస్తువులు మొదలు రూ.1 లక్ష విలువ చేసే లగ్జరీ వస్తువుల వరకు ఈ సేల్‌ ద్వారా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌ 'ది బిగ్ బిలియన్ డేస్' సేల్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. స్మార్ట్ ఫోన్లు, గేమింగ్ ల్యాప్‌టాప్స్, ప్రింటర్స్, మానిటర్స్, మొబైల్ యాసెసరీస్, ట్రిమ్మర్స్, హెడ్ ఫోన్స్ తదితర వస్తువులపై ఈ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్యాన్లు, గీజర్లు, ఇతరత్రా గృహోపకరణాలపై కూడా 80 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. దీనికి అదనంగా  బిగ్ బిలియన్ డేస్ సేల్ కోసం ఫ్లిప్‌కార్ట్ ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ లతో  టైఅప్ అయింది. తద్వారా ఈ బ్యాంకు కార్డులపై బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో 10 శాతం తక్షణ తగ్గింపు పొందే ఆఫర్ అందుబాటులో ఉండనుంది.

ఈ సేల్‌ 24 గంటలకు ముందే ఫ్లిప్‌ కార్ట్‌ ప్లస్‌ వినియోగదారులు కొనుగోలు చేసే సౌకర్యం కల్పిస్తుంది. ఇందులో భాగంగా ఐఫోన్‌ 12 సిరీస్‌, ఐఫోన్‌ 13 అమ్మకాలు జరపనుంది. దీంతో పాటు ఈ బుధవారం విడుదలయ్యే ఐఫోన్‌ 14సిరీస్‌ ఫోన్‌ సైతం అమ్మనుంది. వీటితో పాటు రియల్‌ మీ, పోకో, వివో,యాపిల్‌,శాంసంగ్‌ ఫోన్‌లను డిస్కౌంట్‌ ధరలకే సొంతం చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్‌, ఉపకరణాలు, టీవీలు, గృహోపరకరణాలపై 80శాతం డిస్కౌంట్‌ పొందవచ్చు.

More Telugu News