Twitter: ట్విట్టర్ లో ఇప్పుడిదే కొత్త ట్రెండ్!

  • ట్విట్టర్ లో వన్ వర్డ్ ట్వీట్లు
  • పొరపాటున 'ట్రైన్స్' అంటూ ట్వీట్ చేసిన ఆమ్ ట్రాక్ సంస్థ
  • దాన్నే ఫాలో అయిన ఇతర సంస్థలు, వ్యక్తులు
  • తెలుగులోనూ ఊపందుకున్న సింగిల్ వర్డ్ ట్రెండ్
New trend looms in Twitter

ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా సింగిల్ వర్డ్ ట్వీట్లే కనిపిస్తున్నాయి. ట్విట్టర్ లో ఇప్పుడిదే ట్రెండ్. సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా ఈ వన్ వర్డ్ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. అసలీ ట్రెండ్ పొరపాటున ప్రారంభమైందంటే ఆశ్చర్యం కలగకమానదు. అమెరికా రైల్వే కంపెనీ ఆమ్ ట్రాక్ సెప్టెంబరు 1న పొరబాటున 'ట్రైన్స్' అంటూ ఒకే ఒక్క పదాన్ని ట్వీట్ చేసింది. 

నాసా, ది వాషింగ్టన్ పోస్ట్, మెయిల్ చింప్ వంటి సంస్థలు, దేశాధ్యక్షుడు జో బైడెన్ వంటి ప్రముఖులు కూడా సింగిల్ వర్డ్ ట్వీట్లు చేసి ఆ ఒరవడిలో పాలుపంచుకోవడం విశేషం. భారత్ లోనూ ఈ వన్ వర్డ్ పంథా బాగానే పాప్యులర్ అయింది. క్రికెటర్ దినేశ్ కార్తీక్ తన భార్య పేరు 'దీపిక' (దీపిక పల్లికల్) అంటూ ట్వీట్ చేయగా, దీపిక 'దినేశ్' అంటూ తన భర్త పేరును ట్వీట్ చేసింది. 

తెలుగులోనూ ఈ ట్రెండ్ ఊపందుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమా టీమ్ 'రామరాజు' అంటూ ఒక ట్వీట్, 'భీమ్' అంటూ మరో ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ 'ఫియర్', 'జగత్ జ్జరిక' అంటూ విడివిడిగా ట్వీట్లు చేసింది. 

ఇక, భారత బ్యాటింగ్ మ్యాస్ట్రో సచిన్ టెండూల్కర్ తనకెంతో ఇష్టమైన 'క్రికెట్' అనే పదాన్ని ట్వీట్ చేశారు. ఓవైపు ఈ ట్రెండ్ వీరవేగంతో దూసుకుపోతుండగా, ఆమ్ ట్రాక్ చేసిన తొలి ట్వీట్ 'ట్రైన్స్' కు 1.60 లక్షల లైకులు, 20 వేల రీట్వీట్లు, 3 వేలకు పైగా కోట్ ట్వీట్స్ రావడం విశేషం.
.

More Telugu News