Idols: అమెజాన్ లో విగ్రహాలు కొనుగోలు చేసి పొలంలో దొరికాయని నమ్మించే ప్రయత్నం చేసిన ఘనుడు!

  • డబ్బు సంపాదన కోసం ఎత్తుగడ
  • అమెజాన్ లో రూ.165తో విగ్రహాల ఆర్డర్
  • వాటిని పొలంలో పాతిన యువకుడు
  • ఆపై తనే తవ్వి తీసిన వైనం
  • అతడి ప్రచారాన్ని నమ్మిన గ్రామస్థులు
UP man cheated locals by small idols ordered in Amazon

అప్పుడప్పుడు తవ్వకాల్లోనూ, వ్యవసాయ పనుల సందర్భంగా పురాతన విగ్రహాలు లభ్యం కావడం తెలిసిందే. అవి దేవతా విగ్రహాలు అయితే అక్కడ ఓ ఆలయం నిర్మించడం, ఆపై అది పుణ్యక్షేత్రంగా విలసిల్లడం తెలిసిందే. సరిగ్గా ఈ అంశాన్ని సొమ్ము చేసుకోవాలని ఉత్తరప్రదేశ్ లోని వున్నావోకు చెందిన ఓ యువకుడు ఎత్తుగడ వేశాడు. 

ఈ-కామర్స్ సైట్ అమెజాన్ లో రూ.165 ఖర్చుతో చిన్న విగ్రహాలను కొనుగోలు చేసి, వాటిని తన పొలంలో పాతిపెట్టాడు. తిరిగి వాటిని తనే తవ్వి తీసి తన పొలంలో వ్రిగహాలు దొరికాయంటూ ప్రచారం చేశాడు. 

అక్కడే తాత్కాలికంగా ఓ మందిరం ఏర్పాటు చేయగా, గ్రామస్థులు అతడి ప్రచారాన్ని నమ్మి పూజలు చేయడం, నగదు కానుకలు కూడా సమర్పించడం ప్రారంభించారు. అయితే, ఈ విగ్రహాలను ఆన్ లైన్ లో డెలివరీ ఇచ్చిన వ్యక్తి అందించిన సమాచారం మేరకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో బండారం బట్టబయలైంది. విగ్రహాల ఎత్తుగడకు పాల్పడిన యువకుడి కుటుంబంలోని ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు, పొలంలో దొరికినట్టుగా ప్రచారం జరిగిన చిన్న విగ్రహాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News