Pakistan: భారీ వరదలతో 1‌‌00 కిలోమీటర్ల సరస్సు.. పాకిస్థాన్​ వరదలకు ముందు, తర్వాతి ఫొటోలు విడుదల చేసిన నాసా!

  • పాకిస్థాన్ లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు.. పోటెత్తుతున్న వరదలు
  • ఇప్పటికే 1,100 మందికిపైగా మృతి.. చాలా మంది గల్లంతు
  • వరద పరిస్థితిని శాటిలైట్ తో పరిశీలించిన నాసా.. ఫొటోల విడుదల
Devastating floods in pakistan creates wast inland lake

పాకిస్థాన్ లో ఎన్నడూ లేనంత భారీగా వరదలు రావడం, సింధు నది పోటెత్తడంతో చాలా ప్రాంతం జలమయంగా మారింది. ఏకంగా వంద కిలోమీటర్ల వెడల్పున ఓ సరస్సులా మారిపోయింది. దీనికి సంబంధించి పాకిస్థాన్ వరదలకు ముందు, తర్వాతి చిత్రాలను నాసా తాజాగా విడుదల చేసింది. నాలుగు రోజుల కిందట నాసాకు చెందిన మోడిస్ శాటిలైట్ సెన్సర్ తో.. పాకిస్థాన్ లోని సింధ్ రాష్ట్రానికి సంబంధించిన చిత్రాలను తీసినట్టు ప్రకటించింది.

  • ఇందులో ఆకుపచ్చ రంగులో ఉన్నవి అడవులు, పొలాలు కాగా.. గోధుమ రంగులో ఉన్నవి సాధారణ భూములు, ప్రాంతాలు.. ఇక ముదురు నీలం రంగులో ఉన్నవన్నీ నీళ్లు.
  • పాకిస్థాన్ లో అతి భారీ వర్షాలు, వరదల కారణంగా దాదాపు 100 కిలోమీటర్ల వెడల్పున, అంతకు మించిన పొడవుతో భారీ సరస్సులా ఏర్పడిందని నాసా వెల్లడించింది.
  • దీనికి సంబంధించి ఆగస్టు 4న, అదే నెల 28న తీసిన రెండు చిత్రాలను పోల్చుతూ విడుదల చేసింది. తొలి చిత్రంలో సింధ్ ప్రావిన్స్ సాధారణంగా ఉండగా.. రెండో చిత్రంలో నీట మునిగి కనిపిస్తుండటం గమనార్హం.
  • పాకిస్థాన్ లో దాదాపు నెల రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 30 ఏళ్ల వార్షిక సగటు కంటే ఏకంగా ఐదారు రెట్లు భారీగా వరదలు పోటెత్తడంతో 1,100 మందికిపైగా మరణించారు.
  • సుమారు 3,500 కిలోమీటర్ల పొడవునా రోడ్లు కొట్టుకుపోగా.. 150 వంతెనలు దెబ్బతిన్నాయి. 

More Telugu News