tech tips: ఫోన్ పోతే.. ఇలా దాని ఆచూకీ పట్టి, బ్లాక్ చేయవచ్చు

  • టెలికం శాఖ నిర్వహణలో సీఈఐఆర్ పోర్టల్
  • ఈ పోర్టల్ కు వెళ్లి ఐఎంఈఐ నంబర్, మొబైల్ నంబర్ వివరాలు ఇవ్వాలి
  • దీనికంటే ముందు పోలీసు కంప్లయింట్ తప్పనిసరి
How to track stolen iPhone or Android smartphone

స్మార్ట్ ఫోన్ పోయే రిస్క్ ఎక్కువ. అది చోరీ కావచ్చు, మర్చిపోవచ్చు. మరొక రూపంలో కావచ్చు. స్మార్ట్ ఫోన్ ను పోగొట్టుకున్నప్పుడు అందులోని సురక్షితమైన డేటా ప్రమాదంలో పడుతుంది. ఫోన్ విలువ నష్టపోవడం వేరు, అందులోని సున్నిత డేటా పరుల చేతుల్లోకి వెళ్లడం వేరు. అందుకే ఫోన్ పోతే.. అది కనిపించదిక అనుకుని వదిలేయవద్దు. కనీసం ఫోన్ ను బ్లాక్ అయినా చేసుకోవాలి. అందుకు పలు మార్గాలున్నాయి.

కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్)ను నిర్వహిస్తోంది.  నకిలీ ఫోన్లను కట్టడి చేసేందుకు టెలికం శాఖ దీన్ని రూపొందించింది. దీన్ని ఆశ్రయించడం ద్వారా మెరుగైన ఫలితం ఉంటుంది. సాధారణంగా ఫోన్ పోతే నేడు ‘ఫైండ్ మై డివైజ్’ ఫీచర్ ను ఉపయోగించొచ్చు. అలాగే, పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. వీటితోపాటు సీఈఐఆర్ మార్గాన్ని ఉపయోగించుకోవచ్చు.

సీఈఐఆర్ వెబ్ సైట్ కు వెళ్లి అందులోని బ్లాక్ ఆప్షన్ ఉపయోగించుకోవాలి. ఈ ఆప్షన్ ఎంపిక చేసుకున్న తర్వాత పూర్తి వివరాలు కోరుతూ పేజీ కనిపిస్తుంది. అందులో మొబైల్ నంబర్, ఫోన్ ఐఎంఈఐ నంబర్ (బాక్స్ పై ఉంటుంది), మోడల్, ఇతర వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. పోలీసు కంప్లయింట్ నంబర్ కూడా ఇక్కడ ఇవ్వాలి. అనంతరం ఈ వివరాల ఆధారంగా సదరు ఫోన్ ఏ నెట్ వర్క్ పరిధిలో ఉన్నా కానీ, సీఈఐఆర్ గుర్తించి బ్లాక్ చేస్తుంది.

More Telugu News