Bandla Ganesh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్.. సెప్టెంబర్ 2న ‘ఆహా’లో వచ్చేస్తున్న ‘డేగల బాబ్జీ’

  • కమెడియన్ బండ్ల గణేశ్ ప్రధాన పాత్రలో వచ్చిన డేగల బాబ్జీ
  • తమిళ సినిమా ‘ఉత్త సిరుప్పు సైజు 7’కు రీమేక్
  • పవన్ కల్యాణ్ బర్త్ డేను పురస్కరించుకుని విడుదల చేస్తున్న వైనం 
Bandla Ganesh Degala Babji will be premier on sep 2 on Aha

ఒకప్పుడు కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటుడు బండ్ల గణేశ్.. నిర్మాత గానూ పలు సూపర్ డూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు.  ఈ ఏడాది ‘డేగల బాబ్జీ’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తమిళంలో జాతీయ అవార్డు అందుకున్న ‘ఉత్త సిరుప్పు సైజు 7’ను తెలుగులో డేగల బాబ్జీగా రీమేక్ చేశారు. తమిళంలో పార్థీబన్ నటించిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది.  

కాగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డేను పురస్కరించుకుని సెప్టెంబరు 2న ఆహా ఓటీటీలో ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. వెంకట్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మించారు. 

More Telugu News