Balakrishna: బాలకృష్ణ 107వ సినిమా సెట్స్ నుంచి స్పెషల్ పిక్!

  • షూటింగు దశలో బాలయ్య 107వ సినిమా 
  • విదేశాల్లో జరుగుతున్న షూటింగ్ 
  • సంగీత దర్శకుడిగా తమన్ 
  • నటుడిగా 48 ఏళ్లను పూర్తి చేసిన బాలయ్య
Balakrishna 107 Movie Update

బాలకృష్ణ కథానాయకుడిగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన నాయికగా శ్రుతిహాసన్ అలరించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు విదేశాల్లో జరుగుతోంది. 

ఈ సినిమా లొకేషన్ నుంచి ఒక సెల్ఫీ ని దర్శకుడు గోపీచంద్ మలినేని షేర్ చేశాడు. బాలకృష్ణ .. శ్రుతి హాసన్ .. గోపీచంద్ ఉన్న ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలకృష్ణ ఫస్టు మూవీ విడుదలై నేటికి 48 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, తన సినిమా నుంచి గోపీచంద్ మలినేని ఈ ఫొటోను షేర్ చేశాడు.

బాలకృష్ణ తన కెరియర్లో చేసిన ఫస్టు మూవీ 'తాతమ్మ కల'. ఎన్టీ రామారావు నటించి .. దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా 1974 .. ఆగస్టు 30వ తేదీన విడుదలైంది. అలా బాలయ్య ఇండస్ట్రీకి వచ్చి 48 ఏళ్లు పూర్తి చేసుకున్నట్టు అయింది. ఇక బాలయ్య 107వ సినిమాకి త్వరలోనే టైటిల్ ను సెట్ చేయనున్నారు. దునియా విజయ్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు..

More Telugu News