Break Out: 'బ్రేక్ అవుట్' చిత్రం ట్రైలర్ ను విడుదల చేసిన అల్లు అర్జున్

  • బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ ప్రధానపాత్రలో బ్రేక్ అవుట్
  • సుబ్బు చెరుకూరి దర్శకత్వం
  • ఈ సినిమా కాన్సెప్ట్ చాలా ఆసక్తి కలిగిస్తోందన్న బన్నీ
  • చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అంటూ ట్వీట్
Allu Arjun launches Break Out movie trailer

టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ ప్రధానపాత్రలో సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'బ్రేక్ అవుట్'. కాగా, ఈ చిత్రం ట్రైలర్ ను టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు విడుదల చేశారు. 

సోషల్ మీడియాలో 'బ్రేక్ అవుట్' చిత్రం ట్రైలర్ ను లాంచ్ చేసిన సందర్భంగా అల్లు అర్జున్ స్పందిస్తూ... ఈ సినిమా కాన్సెప్ట్ చాలా ఆసక్తి కలిగిస్తోందని, ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. టాలీవుడ్ లో ఓ యంగ్ టీమ్ ఈ తరహా కథలతో ప్రయోగాత్మకంగా ముందుకు రావడం తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు. రాజా గౌతమ్, దర్శకుడు సుబ్బుతో పాటు చిత్రయూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని బన్నీ చెప్పారు. ఈ మేరకు తన ట్వీట్ తో పాటు ట్రైలర్ వీడియోను కూడా పంచుకున్నారు. 

అనిల్ మోదుగ ఫిలింస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం సర్వైవల్ హారర్ జానర్ లో వస్తోంది. ఇందులో రాజా గౌతమ్ తో పాటు కిరీటి దామరాజు, చిత్రం శ్రీను, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి, రమణ భార్గవ్ తదితరులు నటిస్తున్నారు.

More Telugu News