Monitor Lizards: రోడ్డు మీద నిలబడి కుస్తీ పట్టిన భారీ బల్లులు.. అర గంట ట్రాఫిక్ జామ్.. వీడియో ఇదిగో

  • మానిటర్ లిజర్డ్స్ గా పిలిచే భారీ బల్లులకు థాయిలాండ్ ఆవాసం
  • అలాంటి రెండు ఇటీవల రోడ్డు మీదికి వచ్చి పోరాటానికి దిగిన వైనం
  • ఆధిపత్యం కోసమే ఆ బల్లులు ఇలా చేస్తాయని వెల్లడించిన స్థానికులు
Monitor lizards wrestling in the middle of the road

కుక్కపిల్లలో, పిల్లులో కొట్టుకోవడం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ఓ జంతువు మరో జంతువు వెంటపడుతూ పరుగెత్తడమూ కనిపిస్తుంది. కానీ రెండు భారీ పరిమాణంలోని బల్లులు రోడ్డు మీదికి వచ్చి కొట్టుకుంటుంటే.. అదీ ఏడెనిమిదేళ్ల పిల్లల అంత పెద్దగా ఉండే బల్లులు అయితే.. వామ్మో అనిపిస్తుంది కదా. థాయిలాండ్ లో ఇటీవలే ఇలాంటి ఘటన జరిగింది. మానిటర్ లిజర్డ్స్ గా పిలిచే భారీ రకం బల్లులు రెండు నడి రోడ్డు మీదికి వచ్చి.. రెజ్లింగ్ చేస్తున్నట్టుగా ఒకదాన్ని ఒకటి పట్టుకుని నిలబడిపోయి అందరినీ కంగారు పెట్టించాయి.

అతి పెద్ద బల్లి జాతి జీవులతో..

  • భూమ్మీద అతిపెద్ద బల్లి జాతుల్లో మానిటర్ లిజర్డ్స్ ఒకటి. తోకతో కలిపి రెండు మీటర్ల వరకు పొడవు పెరిగే ఈ రకం బల్లులు.. థాయిలాండ్ లో సహజంగానే కనిపిస్తుంటాయి.
  • వీటిలో మగ బల్లులు ఆధిపత్యం నిరూపించుకోవడం కోసం రెజ్లింగ్ తరహాలో పోట్లాటకు దిగడం సాధారణమే. ఈ క్రమంలోనే ఇటీవల రెండు మగ బల్లులు నడి రోడ్డుపైకి వచ్చాయి. కౌగిలించుకున్నట్టుగా గట్టిగా ఒకదాన్ని మరొకటి పట్టుకుని నిలబడ్డాయి. దీనితో దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.
  • ఒక కారులో వెళుతున్న వ్యక్తి దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారింది. 
  • మొదట చూసినవారికి బల్లులు కౌగిలించుకున్నట్టుగానే కనిపిస్తాయి. కానీ అవి రెండూ మగ బల్లులు అని.. తమ ఆధిపత్యం చూపడం కోసం పోరాడుతున్నాయని స్థానికులు చెప్పారు. నౌదిస్ రిపోర్ట్ అనే వార్తా సంస్థ దీనిని ప్రసారం చేసింది కూడా.
  • ఇటీవల భారత ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా కూడా ఇలాంటి ఓ భారీ బల్లుల వీడియోను ట్విట్టర్ లో పెట్టారు. దాన్ని చూసినవారు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

  


More Telugu News