CJI: కోర్టు రూం లైవ్ స్ట్రీమింగ్‌ను స్వాగ‌తించిన సాయిరెడ్డి... సెటైర్ వేసిన టీడీపీ

  • సీజేఐగా ప‌ద‌వీ విరమణ చేయ‌నున్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌
  • చివ‌రి విచార‌ణ‌ల‌ను లైవ్ స్ట్రీమింగ్‌లో చూపించిన సీజేఐ
  • కోర్టు విచార‌ణ‌ల లైవ్ స్ట్రీమింగ్‌ను స్వాగ‌తిస్తూ సాయిరెడ్డి ట్వీట్‌
  • కోర్టుల లైవ్ స్ట్రీమింగ్‌లో మీ బాస్ తో పాటు మిమ్మల్నీ చూడగలమంటూ టీడీపీ సెటైర్‌
tdp powerfull punch on vijay sai reddy tweet on court room live streaming

భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తున్న సంద‌ర్భంగా శుక్ర‌వారం సుప్రీంకోర్టులో జ‌రిగిన విచార‌ణ‌ను లైవ్ స్ట్రీమింగ్ చేసిన జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ చ‌ర్య‌ను వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి స్వాగ‌తిస్తూ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. కోర్టు విచార‌ణ‌ల లైవ్ స్ట్రీమింగ్ ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామ‌మ‌ని, ఈ చ‌ర్య‌తో మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త సాధ్య‌మ‌ని కూడా సాయిరెడ్డి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ ట్వీట్‌ను చూసినంత‌నే ఏపీలో విప‌క్షం టీడీపీ సెటైరిక‌ల్‌గా స్పందించింది. సాయిరెడ్డి ట్వీట్‌ను 'నైస్' అంటూ పేర్కొన్న టీడీపీ... కోర్టు విచార‌ణ‌ల లైవ్ స్ట్రీమింగ్‌లో, రూ.43 వేల కోట్ల ఆక్ర‌మార్జ‌న‌, మ‌నీ ల్యాండరింగ్ కేసుల్లో మీతో పాటు మీ అవినీతి బాస్ ఏ1ను కూడా భవిష్యత్తులో తాము చూడగలుగుతామని తెలిపింది. 

More Telugu News