Chintamani: చింతామణి నాటకం నిషేధంపై రఘురామకృష్ణరాజు పిటిషన్.. నాటకం అసలు ప్రతిని అందించాలన్న హైకోర్టు

  • తెలుగు వారిని దశాబ్దాల పాటు అలరించిన చింతామణి నాటకం
  • నాటకాన్ని నిషేధించాలని ఎవరూ కోరలేదన్న రఘురామ తరపు న్యాయవాది
  • ఒక సామాజికవర్గాన్ని తృప్తి పరిచేందుకే నిషేధించారని వాదన
Chintamani drama hearing in AP High Court

ఎన్నో దశాబ్దాలుగా తెలుగు వారిని అలరించిన చింతామణి నాటకాన్ని ఏపీ ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. నాటకాన్ని ప్రభుత్వం నిషేధించడాన్ని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు ఈరోజు విచారించింది. రఘురాజు తరపున న్యాయవాది ఉమేశ్ చంద్ర వాదనలను వినిపించారు.

చింతామణి నాటకాన్ని నిషేధించాలని రాష్ట్రంలో ఎవరూ కోరలేదని... ఒక సామాజికవర్గాన్ని కించపరిచే పదాలను మాత్రమే తొలగించాలని కోరారని కోర్టుకు తెలిపారు. అయితే ఆ సామాజికవర్గాన్ని సంతృప్తి పరిచేందుకే నాటకంపై ప్రభుత్వం నిషేధం విధించిందని చెప్పారు. వాదనలు విన్న న్యాయస్థానం నాటకం అసలు ప్రతిని అందించాలని కోరింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

More Telugu News