Cottonmouth: కనబడకుండా పోయిన పాము.. ఎక్స్​ రే తీస్తే మరో పాము కడుపులో ఇలా కనిపించింది!

  • అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న మియామీ జూలో ఘటన
  • జూలో కనిపించకుండా పోయిన పాము కోసం వెతుకులాట
  • అది మరో పాము కడుపులో కనిపించిన వైనం
  • ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ ద్వారా ట్రాక్ చేస్తుండగా గుర్తింపు
Cottonmouth snake swallows Burmese python

పామును మరో పాము మింగడం అప్పుడప్పుడూ కనిపించేదే. ఏదో చిన్న చిన్న పాములు అలా కనిపిస్తుంటాయి. ఒక్కోసారి పెద్ద పామును మరో చిన్నపాము మింగేయడం వంటివీ జరుగుతుంటాయి. కానీ అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన మియామి జూలో మాత్రం ఓ చిత్రం జరిగింది. జూ సిబ్బంది చిన్న చిన్న జంతువులన్నింటికీ ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్) అమర్చి ట్రాక్ చేస్తూ ఉంటారు. అటూ ఇటూ తిరుగుతూ ఉండే ఆ జంతువులు ఎక్కడున్నాయో దీనితో సులువుగా గుర్తించవచ్చు. ఇదే తరహాలో ఓ చిన్నపాటి కొండ చిలువకు కూడా ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ ను అమర్చిపెట్టారు.

పామును వెతుకుతుంటే..

  • మియామీ జూలో ఓ రోజు పాములను ట్రాక్ చేస్తుండగా సదరు చిన్న కొండ చిలువ కనిపించకుండా పోయింది. దాన్ని ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ తో ట్రాక్ చేస్తుంటే.. ఓ చోటులో సిగ్నల్ వచ్చింది.  
  • చిత్రం ఏమిటంటే.. అక్కడ రెండు పాముల సిగ్నల్స్ వస్తుంటే.. ‘కాటన్ మౌత్’ రకం పాము ఒకటే కనిపించింది. ఇదేమిటని జూ సిబ్బంది ఆ పామును తీసుకెళ్లి జూ జంతు వైద్య నిపుణులకు అప్పగించారు.
  • జంతు వైద్య నిపుణులు ఆ పామును ఎక్స్ రే తీసి చూడగా.. దాని కడుపులో కొండ చిలువ కనిపించింది.
  • ఈ కాటన్ మౌత్ పాము కడుపులో మెలికలు మెలికలుగా తిరిగి ఉన్న కొండ చిలువ అస్థి పంజరంతోపాటు కొండ చిలువకు జూ సిబ్బంది అమర్చిన ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ కూడా కనిపించడం గమనార్హం.
  • పాములను పాములు మింగడం సాధారణమేనని.. కానీ ఒక బర్మీస్ పైథాన్ (బర్మా కొండ చిలువ)ను అమెరికాలో ఎక్కువగా కనిపించే కాటన్ మౌత్ పాము మింగడం విశేషమేనని జూ సిబ్బంది చెబుతున్నారు.
 

More Telugu News