YSRCP: పెడ‌న సీఎం స‌భ‌లో మ‌హిళ మృతి... రూ.10 లక్షల ప‌రిహారం ప్రకటించిన జగన్

  • కృష్ణా జిల్లా పెడ‌న స‌భ‌కు హాజ‌రైన జ‌గ‌న్‌
  • స‌భ‌కు వ‌చ్చి సొమ్మ‌సిల్లి మృతి చెందిన మాణిక్య‌మ్మ‌
  • మ‌హిళ మృతిని జ‌గ‌న్‌కు తెలిపిన మంత్రి ర‌మేశ్
  •  గురువార‌మే బాధిత కుటుంబానికి చెక్ అంద‌జేసిన జోగి ర‌మేశ్
a woman died at pedana cm meeting and government handed over 10 lack rupees cheque to her family

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురువారం కృష్ణా జిల్లా పెడ‌నలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఈ స‌భా వేదిక మీద నుంచి నేతన్న నేస్తం కింద నిధుల‌ను ఆయ‌న ల‌బ్ధిదారుల ఖాతాల్లోకి విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి భారీ సంఖ్య‌లో జ‌నం హాజ‌రు కాగా... స‌భ‌లో ఓ అప‌శ్రుతి చోటుచేసుకుంది. స‌భ‌లోనే సొమ్మ‌సిల్లి ప‌డిపోయిన మాణిక్య‌మ్మ అనే మ‌హిళ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. 

ఈ విష‌యం తెలుసుకున్న మంత్రి జోగి ర‌మేశ్... విష‌యాన్ని నేరుగా సీఎం జ‌గ‌న్‌కు వివ‌రించారు. ఈ వార్త విన్నంత‌నే స్పందించిన జ‌గ‌న్ బాధిత మ‌హిళ కుటుంబానికి రూ.10 లక్ష‌ల ప‌రిహారాన్ని ప్ర‌క‌టించారు. అంతేకాకుండా బాధిత మ‌హిళ కుటుంబానికి త‌క్ష‌ణ‌మే ప‌రిహారం అంద‌జేయాల‌ని ఆయ‌న మంత్రి జోగి ర‌మేశ్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాల‌తో వేగంగా క‌దిలిన ర‌మేశ్... రూ.10 ల‌క్ష‌ల చెక్కును గురువార‌మే మాణిక్య‌మ్మ కుటుంబానికి అంద‌జేశారు.

More Telugu News