BrahMos missile: బ్రహ్మోస్ క్షిపణి మిస్‌ఫైర్ ఘటన.. ముగ్గురు వాయుసేన అధికారులపై వేటు

  • ఈ ఏడాది మే 9న ప్రమాదవశాత్తు మిస్‌ఫైర్ అయిన మిసైల్
  • పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లిన క్షిపణి
  • విచారణ కోసం కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం
  • నివేదిక ఆధారంగా విధుల నుంచి ముగ్గురు అధికారుల తొలగింపు 
BrahMos missile misfire Services of 3 IAF officers terminated

ఈ ఏడాది మార్చిలో మిస్‌ఫైర్ అయిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్‌కు సంబంధించిన ఘటనలో ప్రభుత్వం ముగ్గురు వాయిసేన అధికారులపై వేటేసింది. నియమావళి (ఎస్ఓపీ) పాటించకపోవడమే ఇందుకు కారణమని పేర్కొంటూ గ్రూప్ కెప్టెన్‌తోపాటు ఇద్దరు వింగ్ కమాండర్లను విధుల నుంచి తప్పించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ ఏడాది మే 9న పంజాబ్‌లోని అంబాలా వాయుసేన స్థావరం నుంచి బ్రహ్మోస్ మిసైల్ ఒకటి ప్రమాదవశాత్తు గాల్లోకి లేచి దూసుకుపోయింది. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో పడింది. ఈ ఘటనలో స్వల్ప ఆస్తి నష్టం జరిగింది. అయితే, ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

ఈ ఘటనపై విచారణ కోసం ప్రభుత్వం కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ (కల్నల్)ని ఏర్పాటు చేసింది. తాజాగా, ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో.. స్టాండింగ్ ఆపరేటర్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ)లో మూడు తేడాలు ఉన్నట్టు గుర్తించింది. క్షిపణుల నిర్వహణ విషయంలో నియమావళి పాటించకపోవడమే ఇందుకు కారణమని తేల్చింది. అందుకు ముగ్గురు అధికారులదే బాధ్యత అని పేర్కొంది. నివేదిక ఆధారంగా ఆ ముగ్గురు అధికారులను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

More Telugu News