Sudheer Babu: 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' నుంచి బ్యూటిఫుల్ సాంగ్!

  • ఇంద్రగంటి నుంచి మరో విభిన్న కథా చిత్రం 
  • సుధీర్ బాబు సరసన నాయికగా కృతి శెట్టి 
  • సంగీత దర్శకుడిగా వివేక్ సాగర్ 
  • వచ్చేనెల 16వ తేదీన సినిమా రిలీజ్ 
Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Song Released

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రెండు సినిమాలు చేసిన సుధీర్ బాబు, మూడో సినిమాగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ - బెంచ్ మార్క్ స్టూడియోస్ వారు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా కొంతకాలం క్రితమే విడుదలకి ముస్తాబైంది. కాకపోతే సరైన విడుదల తేదీ కోసం వెయిట్ చేస్తూ వచ్చింది.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక వీడియో సాంగును రిలీజ్ చేశారు. "అల్లంత దూరాన నువ్వు నీ కళ్లు నన్నే చూస్తుంటే ఏం చేయాలో, రవ్వంత గారంగ నాలోని నన్ను మాటాడిస్తుంటే ఏం చెప్పాలో" అంటూ ఈ పాట సాగుతోంది. హీరో హీరోయిన్ ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులై .. ప్రేమలో తొలి అడుగులు వేస్తున్న సందర్భంలో వచ్చే పాట ఇది.

వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించాడు. ట్యూన్ .. సాహిత్యం రెండూ కూడా మనసుకు పట్టుకునేలా ఉన్నాయి. ఈ పాట ఈ ఆల్బమ్ కి హైలైట్ గా నిలిచే  అవకాశం ఉంది. వెన్నెల కిశోర్ .. అవసరాల శ్రీనివాస్ .. రాహుల్ రామకృష్ణ  ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, సెప్టెంబర్ 16వ తేదీన విడుదల కానుంది.

More Telugu News