ODF: ఓడీఎఫ్‌ ప్లస్ గ్రామాలలో దేశంలోనే టాప్ లేపిన తెలంగాణ‌!

  • తెలంగాణ‌లో మొత్తం 12,769 గ్రామాలు
  • రాష్ట్రంలో ఓడీఎఫ్ ప్లస్ (బ‌హిరంగ మ‌ల విస‌ర్జ‌న రహిత) గ్రామాలుగా 12,766
  • 99.98 శాతంతో టాప్‌లో నిలిచిన తెలంగాణ‌
telangana tops odf plus villages ranks

పారిశ్రామికంగానే కాకుండా, త‌ల‌స‌రి ఆదాయం, ప‌న్నుల రాబ‌డి, జీడీపీ త‌దిత‌ర అంశాల్లో దేశంలోనే అగ్ర‌గామి రాష్ట్రంగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న తెలంగాణ తాజాగా మ‌రో కీల‌కమైన అంశంలో టాప్ లేపింది. బ‌హిరంగ మ‌ల విస‌ర్జ‌న రహిత (ఓడీఎఫ్‌ ప్లస్)లో తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఉత్త‌మ ఫ‌లితాలు సాధించి అగ్ర స్థానంలో నిలిచింది. ఈ మేర‌కు శుక్ర‌వారం కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఓడీఎఫ్ ర్యాంకుల్లో 99.98 శాతంతో ఈ జాబితాలో తెలంగాణ‌ అగ్ర‌స్థానంలో నిలిచింది

రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామాలు ఉండ‌గా... వాటిలో 12,766 గ్రామాలు ఓడిఎఫ్ గ్రామాలుగా గుర్తింపు సంపాదించాయి. ఓడీఎఫ్ లేని గ్రామాలుగా తెలంగాణ‌లో కేవ‌లం మూడంటే మూడు గ్రామాలు మాత్ర‌మే మిగిలాయి. వెర‌సి ఓడీఎఫ్ సాధ‌న‌లో తెలంగాణ రాష్ట్రం 99.98 శాతం ఫ‌లితాల‌ను రాబ‌ట్టిన‌ట్టయింది.

More Telugu News