Nikhil: రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి .. 'కార్తికేయ 2' వసూళ్లు మామూలుగా ఉండవు: నిఖిల్

  • ఈ నెల 13న వచ్చిన 'కార్తికేయ 2'
  • బాలీవుడ్ లోను భారీ వసూళ్లు 
  • కలిసిరానున్న శ్రీకృష్ణ జన్మాష్టమి 
  • త్వరలోనే మలయాళ వెర్షన్ రిలీజ్
Karthikeya 2 movie update

నిఖిల్ - చందూ మొండేటి కాంబినేషన్లో రూపొందిన 'కార్తికేయ 2' ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీకృష్ణుడి కంకణానికి సంబంధించి హీరో సాగించే అన్వేషణే ఈ కథ. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమా విడుదలైన ప్రతి ప్రాంతంలోను సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది.
 
తాజా ఇంటర్వ్యూలో నిఖిల్ మాట్లాడుతూ .. "ఈ సినిమా హిట్ అవుతుందని అనుకున్నాము .. కానీ ఈ స్థాయిలో రెస్పాన్స్ ఉంటుందని ఎంతమాత్రం ఊహించలేదు. రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి .. ఇది శ్రీకృష్ణుడి చుట్టూ తిరిగే కథ కావడం వలన ఈ సినిమా వసూళ్లు ఒక రేంజ్ లో పెరగవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది" అన్నాడు.  

హిందీ వెర్షన్ కి సంబంధించి కూడా మరిన్ని థియేటర్లు పెరగనున్నాయని అంటున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సమయానికి ఈ సినిమా థియేటర్లలో ఉండటమనేది కూడా ఆ స్వామి అనుగ్రహమే. మలయాళంలో  కూడా త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News