Anand Mahindra: 3.5 కిలోమీటర్ల పొడవైన రైలుపై ఆనంద్ మహీంద్రా స్పందన

  • అతి పొడవైన గూడ్స్ రైలు వీడియోను షేర్ చేసిన పారిశ్రామికవేత్త
  • భారత వృద్ధి పథం మాదిరే ముగింపు లేకుండా ఉందంటూ క్యాప్షన్
  • 295 వ్యాగన్లతో 3.5 కిలోమీటర్ల పొడవు ఈ రైలు ప్రత్యేకత
What Anand Mahindra has to say about Indias longest freight train Super Vasuki

భారతీయ రైల్వే ఓ అరుదైన ప్రయత్నాన్ని ఆచరణలో పెట్టింది. దేశంలోనే అతి పొడవైన, భారీ బరువును మోసుకుని పోయే ‘సూపర్ వాసుకి’ గూడ్స్ రైలును ఈ నెల 15న పరీక్షించి చూసింది. ఈ గూడ్స్ రైలు వెళుతుంటే కొన్ని నిమిషాల సేపు అది మనకు కనిపిస్తుంది.   

ఎందుకంటే దీని పొడవు 3.5 కిలోమీటర్లు. ఛత్తీస్ గఢ్ లోని కొథారి రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి వెళుతుండగా తీసిన వీడియో ఒక్కసారి చూస్తే.. దీని పొడవు, సామర్థ్యం గురించి అర్థమవుతుంది. నెట్టింట ఈ వీడియో ఎంతో మందిని ఆశ్చర్యానికి గురిచేస్తూ, ఆసక్తిని కలిగిస్తోంది. 295 వ్యాగన్లు, 6 లోకో ఇంజన్లతో ఉండే ఈ గూడ్స్ రైలు బరువు 25,962 టన్నులు. 

భిన్నమైన, వినూత్నమైన అంశాలను ట్విట్టర్లో పంచుకునే ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు అధినేత ఆనంద్ మహీంద్రా ఈ సూపర్ వాసుకి గూడ్స్ రైలు వీడియోను కూడా షేర్ చేశారు. ‘‘అద్భుతం.  ఇది భారత్ అభివృద్ధి చెందుతున్న మాదిరిగా ఉంది. ముగింపు లేకుండా’’ అని ఆయన క్యాప్షన్ పెట్టారు.

More Telugu News