Varun Tej: 'కార్తికేయ' దర్శకుడితో వరుణ్ తేజ్!

  • 'కార్తికేయ 2'తో హిట్ కొట్టిన చందూ
  • తదుపరి సినిమా గీతా ఆర్ట్స్ లో
  • ఈ విషయాన్ని ధ్రువీకరించిన అల్లు అరవింద్ 
  • వరుణ్ తేజ్ తో సెట్స్ పైకి వెళ్లే అవకాశం
Varun tej in Chandu Mondeti Movie

వరుణ్ తేజ్ ఈ మధ్య కాలంలో చేసిన 'గని' భారీ పరాజయాన్ని చవిచూసింది. ఆ తరువాత ఆయన చేసిన 'ఎఫ్ 3' కూడా ఫస్టు పార్టు స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఆ తరువాత సినిమాను ఆయన ఎవరితో చేయనున్నాడా అనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఇప్పుడు చందూ మొండేటి పేరు తెరపైకి వచ్చింది. 

చందూ మొండేటి నుంచి తాజాగా వచ్చిన 'కార్తికేయ 2' తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లోను దూసుకుపోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ల్లో చందూ మాట్లాడుతూ, తన తదుపరి సినిమా గీతా ఆర్ట్స్ లో ఉందని చెప్పాడు. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ, తన బ్యానర్లో చందూ ఒక సినిమా చేయనున్నాడనే విషయాన్ని ధ్రువీకరించారు. 

6 నెలలకి పైగా ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని చెప్పారు. దాంతో ఈ సినిమాను వరుణ్ తేజ్ హీరోగా చేయనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. వరుణ్ తేజ్ తో సినిమా తరువాత చందూ 'కార్తికేయ 3'పై దృష్టి పెట్టొచ్చని అంటున్నారు. త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More Telugu News