Dhanush: 'తిరు' టైటిల్ తో హఠాత్తుగా ఎంట్రీ ఇస్తున్న ధనుశ్!

  • ధనుశ్ హీరోగా రూపొందిన 'తిరు'
  • దర్శకత్వం వహించిన మిత్రన్ జవహర్ 
  • సంగీత దర్శకుడిగా అనిరుధ్ 
  • తమిళ .. తెలుగు భాషల్లో రేపు రిలీజ్  
Thiru movie release date confirmed

ఈ నెలలో ఇంతవరకూ థియేటర్లకు వచ్చిన సినిమాలు మంచి వసూళ్లను రాబడుతున్నాయి. ఇక ఈ శుక్రవారం ఓ అరడజను చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. ఆది సాయికుమార్ 'తీస్ మార్ ఖాన్' .. సునీల్  'పండుగాడ్'తో పాటు, 'మాటరాని మౌనమిది' .. 'కమిట్ మెంట్' వంటి సినిమాలు ఆ జాబితాలో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఆ సినిమాలకి ఒకరోజు ముందుగానే .. అంటే ఈ నెల 18వ తేదీన ధనుశ్ రంగంలోకి దిగిపోతున్నాడు. ఆయన తాజా చిత్రమైన 'తిరు' .. రేపు భారీ స్థాయిలో ప్రేక్షకులను  పలకరించనుంది. ధనుశ్ హీరోగా మిత్రన్ జవహర్ దర్శకత్వంలో 'తిరుచిత్రాన్బలం' రూపొందింది. సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. 

ధనుశ్ ఈ సినిమాలో మూడు డిఫరెంట్  లుక్స్ తో కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికలుగా రాశి  ఖన్నా .. నిత్యామీనన్ .. ప్రియ భవాని శంకర్ కనిపించనున్నారు. కీలకమైన పాత్రను ప్రకాశ్ రాజ్ పోషించారు. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను రేపు విడుదల చేస్తున్నారు.

More Telugu News