Narendra Modi: ప్రధాని కొత్త నినాదం ఓ గిమ్మిక్కు: కాంగ్రెస్ విమర్శలు

  • నిన్న భారత స్వాతంత్ర్య దినోత్సవం
  • ఎర్రకోటపై ప్రధాని మోదీ ప్రసంగం
  • జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అంటూ మోదీ నినాదం
  • అన్నీ అబద్ధాలేనన్న కాంగ్రెస్
Congress party terms PM Modi new slogan gimmick

భారతదేశ 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట పైనుంచి వెలువరించిన ప్రసంగం పట్ల కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధించింది. "జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్" అంటూ మోదీ చేసిన నినాదం ఓ గిమ్మిక్కు అని అభివర్ణించింది. ఈ మేరకు అబద్ధం వర్సెస్ నిజం (జూమ్లా వర్సెస్ రియాలిటీ) పేరిట కాంగ్రెస్ పార్టీ ఓ వీడియో క్లిప్పింగ్ విడుదల చేసింది. మోదీ నినదించిన నాలుగు రంగాల్లోనూ కేంద్ర ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉందని విమర్శించింది. 

'జై జవాన్' అంటున్న కేంద్రం అగ్నివీరులకు నాలుగేళ్ల తర్వాత ఉద్యోగ భరోసా ఇవ్వలేకపోతోందని పేర్కొంది. 'జై కిసాన్' విషయానికొస్తే, రైతులకు కనీస మద్దతు ధర అందించలేకపోతుందని, 'జై విజ్ఞాన్' అంటున్న కేంద్రం సైన్స్ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం తప్ప ఏం చేసిందని కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. 'జై అనుసంధాన్' అనడం కూడా కేవలం మాట వరుసకేనని పేర్కొంది.

More Telugu News