Prashanth Neel: సొంత గ్రామానికి భారీ విరాళం ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. మాజీ మంత్రి రఘువీరారెడ్డి భావోద్వేగం

  • రఘువీరారెడ్డి సోదరుడి కుమారుడే ప్రశాంత్ నీల్
  • వీరిది మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురం గ్రామం
  • గ్రామంలో నిర్మిస్తున్న ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి రూ. 50 లక్షల విరాళం ఇచ్చిన ప్రశాంత్ నీల్
Director Prashanth Neel donates Rs 50 laksh to his village Neelakantapuram

'కేజీఎఫ్' సినిమాలతో దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు దేశమంతా మారుమోగింది. బాలీవుడ్ బాక్సాఫీస్ ను సైతం ప్రశాంత్ నీల్ షేక్ చేశారు. ప్రశాంత్ నీల్ ఎవరో కాదు... మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ రెడ్డి కుమారుడే. వీరిది ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురం గ్రామం. 

తాజాగా తన గ్రామానికి ప్రశాంత్ నీల్ భారీ విరాళాన్ని అందించారు. నీలకంఠాపురంలో నిర్మిస్తున్న ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి రూ. 50 లక్షల విరాళాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. నీలకంఠాపురం గ్రామస్థులందరికీ ఇది ఎంతో గర్వించే సందర్భమని ఆయన ట్వీట్ చేశారు. ప్రశాంత్ తండ్రి సుభాష్ రెడ్డి 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని విరాళాన్ని అందించారని చెప్పారు. సరిగ్గా మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజే (1947 ఆగస్ట్ 15)న సుభాష్ రెడ్డి జన్మించారని తెలిపారు.

మరోవైపు, తన తండ్రి జయంతి (ఆగస్ట్ 15) సందర్భంగా ప్రశాంత్ నీల్ కుటుంబ సమేతంగా నీలకంఠాపురం వెళ్లారు. అక్కడ రఘువీరారెడ్డి నేతృత్వంలో నిర్మించిన ఆలయాలను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ వెనుకే రఘువీరారెడ్డి ఉన్నారు.

More Telugu News