Kalyanram: 'బింబిసార' చిత్రీకరణ ఇలా జరిగింది.. మేకింగ్ వీడియో విడుదల!

  • ఈ నెల 5వ తేదీన విడుదలైన 'బింబిసార'
  • దర్శకుడిగా వశిష్ఠపై కురుస్తున్న ప్రశంసలు 
  • తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు 
  • ఓవర్సీస్ లోను పుంజుకున్న వసూళ్లు
Bimbisara movie update

కల్యాణ్ రామ్ కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందిన 'బింబిసార' ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కల్యాణ్ రామ్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. మొదట అందరూ కూడా ఇది చరిత్రలో మనకి కనిపించే బింబిసారుడి కథ అనుకున్నారు. కాదంటూ టీమ్ క్లారిటీ ఇవ్వడం వలన ఇక ఆ దిశగా ప్రేక్షకులు ఆలోచన చేయలేదు.

సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ కథ నడించింది. వేరు వేరు కాలాలకు సంబంధించిన కథను ఆసక్తికరంగా ముందుకు నడిపించడంలో వశిష్ఠ సక్సెస్ అయ్యాడు. మొదటి సినిమానే ఈ స్థాయిలో తీశాడంటే ఈ తరహా సినిమాలను మున్ముందు మరో రేంజ్ లో చేయగలడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా టీమ్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఈ సినిమా కోసం జరుగుతున్న సెట్ నిర్మాణం .. డాన్సులు .. ఫైట్లు కంపోజ్ చేస్తున్న సన్నివేశాలకి సంబంధించిన షాట్స్ పై మేకింగ్ వీడియోను వదిలారు. ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్లు పుంజుకోవడం విశేషం.

More Telugu News