Al Qaida: దైవదూషణకు పాల్పడిన నుపుర్ శర్మకు తగిన బుద్ధి చెప్పండి: భారత ముస్లింలకు పిలుపునిచ్చిన అల్ ఖైదా

  • మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల ఫలితం
  • నుపుర్ పై అల్ ఖైదా ఆగ్రహం
  • ప్రతీకారం తప్పదని హెచ్చరిక
  • ఆత్మరక్షణ జిహాద్ కు పిలుపునిచ్చిన ఉగ్రవాద సంస్థ
Al Qiada calls Indian Muslims bring Nupur Sharma for justice

దైవదూషణకు పాల్పడిన నుపుర్ శర్మను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని భారత ముస్లింలకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా పిలుపునిచ్చింది. నుపుర్ శర్మకు భారత ముస్లింలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని భారత ఉపఖండంలో అల్ ఖైదా బాణీని వినిపించే నవా-ఏ-ఘజ్వా-ఈ-హింద్ పేర్కొంది. నుపుర్ శర్మ వ్యాఖ్యలపై ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. ముస్లింలందరూ శత్రువుకు వ్యతిరేకంగా సాయుధులు కావాలని, ఆత్మరక్షణ జిహాద్ కు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. కశ్మీర్ లో జరుగుతున్న జిహాద్ లో పాలుపంచుకోవాలని సూచించింది. 

ఇప్పటికే పలు జిహాదీ సంస్థల నుంచి ముప్పు ఎదుర్కొంటున్న నుపుర్ శర్మ... తాజాగా అల్ ఖైదా హెచ్చరికతో మరింత ఆందోళనకర స్థితిలో చిక్కుకున్నారు. ఇటీవల ఆమె ఓ టీవీ చానల్లో మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అంతర్జాతీయంగానూ భారత్ పై విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో నుపుర్ శర్మను పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసింది. 

కాగా, నుపుర్ శర్మకు మద్దతు పలికినందుకే కన్హయ్య లాల్, ప్రతీక్ పవార్ అనే వ్యక్తులను హతమార్చిన వైనం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో, నుపుర్ శర్మ  ప్రాణాలకు మరింత ముప్పు ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

More Telugu News